Perni Nani: కూటమి ప్రభుత్వం ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని.. కూటమి ప్రభుత్వ పాలనపై వారికి వారే డబ్బాలు కొట్టుకుంటున్నారు.. ఈ కూటమి సమావేశంలో ఈ సంవత్సర కాలం పాలన, రానున్న రోజుల్లో ఏం చేస్తారో చెప్తారని అందరూ ఊహించారు. కానీ, సొంత డబ్బా కొట్టుకోవడం, జగన్ ని తిట్టటానికే సమావేశం జరిపారని దుయ్యబట్టారు.. చంద్రబాబు 420 అబద్దాలు చెప్పగా, లోకేష్ 840 అబద్దాలు చెప్పారు… కానీ, పవన్ కల్యాణ్ కళ్లు మూసుకొని కూర్చున్నారని సెటైర్లు వేశారు.. కూటమి నేతల మీటింగులో స్నాక్స్ కే లక్షలు ఖర్చు చేశారు. మా హయాంలో జరిగిన అభివృద్ధిపై చంద్రబాబు, లోకేష్ తప్పుడు మాటలు మాట్లాడారు. చంద్రబాబు, జగన్ పాలనలో ఎవరిది సుపరిపాలనో? మాతో చర్చించే దమ్ము ఉందా? అని సవాల్ విసిరారు.. ఎవరి హయాంలో ఆర్ధిక స్థితిగతులు ఎలా ఉన్నాయో చర్చించటానికి రెడీనా? ఈ సంవత్సర కాలంలోనే లక్షా 61 వేల కోట్లు అప్పులను చంద్రబాబు చేశారు. మా హయాంలో జరగనిదాన్ని కూడా జరిగినట్టు విష ప్రచారం చేశారు. అసెంబ్లీలో ఒకమాట, బయట ఇంకో మాట మాట్లాడటం వారికే చెల్లింది. జనాన్ని నమ్మించి మోసం చేసినందుకు చంద్రబాబుపై చీటింగ్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు నాని..
Read Also: Supreme Court : ‘ఆపరేషన్ సింధూర్’ లో పాల్గొంటే కేసు నుంచి రక్షణ ఇవ్వాలా..?
పాలనలో డొల్లతనం, విచ్చలవిడి అవినీతి కారణంగా రాష్ట్రం అభివృద్ధిలో బాగా వెనుక పడింది. అసలు ఈ సంవత్సర కాలంలో ఏం సంపద సృష్టించారు? అని నిలదీశారు పేర్ని నాని.. సూపర్ సిక్స్ పథకాలన్నీ మోసమే. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో బాండ్లు ఇచ్చి జనాన్ని నిలువునా ముంచారు. మెగా డీఎస్సీ పేరుతో తొలి అడుగే తప్పటి అడుగు వేశారు. ఓట్ల కోసం భూసర్వే గురించి జగన్ పై తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు నిసిగ్గుగా ఎలా సర్వే చేస్తున్నారు? పీ4 పేరుతో పేదలను మోసం చేశారు. కోటి 48 లక్షల కుటుంబాలు రాష్ట్రంలో పేదరికంలో ఉన్నారు. కానీ, ఎంతమందిని దత్తత తీసుకుని బాగు చేశారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.. చంద్రబాబు హయాంలో ఎప్పుడూ కన్సల్టెంట్ లే బాగుపడతారు తప్ప పేదలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. పల్లె పండుగ పేరుతో 13 వేల పంచాయతీలలో తీర్మానాలు లేకుండా నిధులు డ్రా చేశారు. ఈ ప్రభుత్వ పాలకులు ఈవెంట్ మేనేజర్లు. 300 కోట్లు ఖర్చు పెట్టి యోగామ్యాట్ ల పండుగ చేశారు.. కేంద్రం ఇచ్చే ఆర్ధిక సంఘం నిధులను కూడా ప్రభుత్వం వాడేసింది.. జనం సొమ్ముతో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ విమానాలు, హెలికాప్టర్ లలో తిరుగుతున్నారు.. మీ సొంత డబ్బులతో అలా హెలికాఫ్టర్ లలో తిరగగలరా? అని ప్రశ్నించారు..
Read Also: Hyderabad: డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డ టెకీ.. ఊడిన ఉద్యోగం.. అయినా మారని వైనం..
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరపడి జీతాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు.. చిన్న చిన్న ఉద్యోగులు అల్లాడిపోతున్నారు.. ఆ ముగ్గురు మాత్రం ప్రత్యేక హెలికాఫ్టర్ లలో తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే పంచాయతీ రాజ్ వ్యవస్థ దిగజారి పోయింది అని విమర్శించారు పేర్ని నాని.. లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. గంజాయు, డ్రగ్స్ టన్నుల కొద్దీ దొరుకుతోంది. కూటమి ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే ఈ దారుణాలు జరుగుతున్నాయి. డీజీపీ ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదు. జగన్ పై ప్రెస్‌మీట్ పెట్టటానికి తప్ప ఆయనకు వేరే పనిలేదు. నేర చరిత్ర, మాఫియాతో సంబంధం ఉన్న వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే హోంమంత్రి వెంటనే అక్కడకు వెళ్తుంది. కానీ, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వైసీపీ వారి మీద తప్పుడు కేసులు పెట్టించటానికే పోలీసులను వాడుతున్నారు అని ఫైర్ అయ్యారు.. ఇక, పిఠాపురంలో దళితులను సంఘ బహిష్కరణ చేస్తే పవన్ కళ్యాణ్ కి ఏమాత్రం పట్టదు. కనీసం ఒక్కరి మీద కూడా చర్యలు లేవు.. జనసేన కార్యకర్త మహిళపై లైంగిక దాడికి పాల్పడితే కనీస చర్యలు కూడా లేవని ఆరోపించారు. హోంమంత్రి అనిత మహానటిని మించి పోయారు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జనం చచ్చిపోతే ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఇప్పుడేమో జగన్ కాన్వాయ్ లో ప్రమాదం జరిగితే ప్రతిపక్షానిదే తప్పు అంటున్నారు. ఇంత బాధ్యత లేని వారు పదవుల్లో ఉండటం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని..