ఐపీఎస్ అధికారి జాషువాకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది.. జాషువాపై ఏసీబీ తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి నిరాకరించింది.. పల్నాడులో స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి డబ్బులు బలవంతంగా వసూలు చేసినట్టు జాషువాపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం విదితే..
నిన్నటి జగన్ టూర్ డ్రామాను తలపించింది.. ఏదో రకంగా శవ రాజకీయాలు చేయాలని చూస్తున్నారు అంటూ మండిపడ్డారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆమె.. వైసీపీ హయాంలో ఐపీసీ సెక్షన్ ప్రకారం కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం పోలీసులు వ్యవహరించారని విమర్శించారు.. ఇక, జగన్ పర్యటన కోసం 1100 మంది పోలీసులను పెట్టాం.. జగన్ వెళ్లే ప్రాంతం చాలా సెన్సిటివ్ ఏరియా.. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నాం..
పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టు చేపట్టేందుకు జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. కంపెనీల చట్టం కింద వంద శాతం ప్రత్యేక వాహక సంస్థగా జలహారతి కార్పొరేషన్ ఉండనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చైర్మన్ గా జల హారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..
గత ఏడాది వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నివాస ప్లాట్‌ను రైతు కుటుంబం నుంచి కొనుగోలు చేసిన విషయం విదితమే కాగా.. ఈ రోజు ఇంటి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.. ఇంటి నిర్మాణ ప్రాంతానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కుటుంబ సభ్యులు చేరుకుని.. వేద పండితుల ఆధ్వర్యంలో శంకుస్థాపన పూజా కార్యక్రమం నిర్వహించారు.
మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన.. ఈ మధ్యే ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసి.. తొలిసారి రాజమండ్రి వచ్చిన సందర్భంగా ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది.. అయితే, తనకు మంత్రి కావాలని లేదు.. మంత్రి కావాలని అనుకుంటే 2014లోనే అయ్యే వాడిని అని స్పష్టం చేశారు.. నా జీవితానికి ఇది చాలు.
జగన్ హెలికాప్టర్ విండ్‌షీల్డ్ ధ్వంసంపై ఆ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.. కుట్రపూరితంగానే పోలీస్ భద్రతను తొలగించారా? అని ప్రశ్నిస్తోంది.. వైఎస్ జగన్ భద్రతపై ప్రతిసారీ ఇదే నిర్లక్ష్యం అంటూ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ముందుగా సమాచారం ఇచ్చే జగన్ రామగిరికి వెళ్లారు.. మాజీ సీఎంకు కనీస భద్రత కల్పించాల్సిన బాధ్యత లేదా? ఆయన ప్రతి పర్యటనలోనూ పోలీసుల తీరు ఇదే రకంగా ఉంది.. కూటమి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు జగన్ భద్రతను…
వైఎస్ జగన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత.. అసలు జగన్ పరామర్శకు వచ్చాడా..? ఎన్నికల ప్రచారానికి వచ్చాడా..? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. చావు ఇంటికి వచ్చి జేజేలు కొట్టించుకుంటున్నాడు.. నీ చుట్టూ ఉన్న వాళ్లు ఆ కుటుంబాన్ని చూసి నవ్వుతున్నారు.. నవ్వు నవ్వుతున్నావో.. ఏడుస్తున్నావో అర్థం కావడం లేదని సెటైర్లు వేశారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలపాలయ్యాడు.. అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్చారు.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, వైసీపీ అధినేత వైఎస్ జగన్, మాజీ మంత్రి ఆర్కే రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
రాప్తాడు పర్యటనకు వచ్చిన జగన్ హెలికాప్టర్ డ్యామేజీ అయ్యింది.. జగన్ వస్తున్నాడని తెలిసి.. భారీగా తరలివచ్చారు వైసీపీ కార్యకర్తలు.. ఇక, హెలిప్యాడ్ దగ్గర జగన్ వచ్చిన హెలికాప్టర్ దిగగానే.. దాని మీదకు దూసుకుపోయారు.. దీంతో.. స్వల్పంగా హెలికాప్టర్ దెబ్బతింది..