గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలింది.. వంశీ రిమాండ్‌ను మళ్లీ పొడిగించింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు.. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించింది కోర్టు..
రాష్ట్రంలో బీహార్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయన్న ఆరోపించిన జగన్.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, శాంతిభద్రతలు దిగజారాయి.. మొత్తం రెడ్‌బుక్ పరిపాలన నడుస్తోందని మండిపడ్డా.. చంద్రబాబు ఎంత భయపెట్టినా.. ప్రలోభాలు పెట్టినా ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది.. అయితే, వైసీపీ గెలిచినచోట్ల చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన.. ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో కాకరేపుతోంది.. ఇటీవల దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీసత్యసాయి జిల్లాకు వెళ్లారు జగన్.. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లిలో గత నెల 30వ తేదీన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబంపై దాడి చేశారు..
అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అత్యుత్సాహం బలభద్రపురం గ్రామానికి శాపంగా మారిందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా పరిశ్రమలో ఏకంగా 900 కారు ఇంజిన్లు మాయం కావడం కలకలం రేపుతోంది.. కియా పరిశ్రమలో రోజుకి వందల కార్లు ఉత్పత్తి అవుతుంటాయి.. ఈ కియా కార్లు తయారు చేసే ప్రధాన పరిశ్రమకు విడిభాగాలు, పరికరాలు 25 కియా అనుబంధ పరిశ్రమల నుంచి వస్తాయి.. అయితే, దాదాపు 900 కియా కార్ల ఇంజిన్లు మాయమైనట్లు యాజమాన్యం గుర్తించింది..
మన్యం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన పర్యటనను కుదించుకున్నట్టుగా తెలుస్తోంది.. సింగపూర్‌లో పవన్ కల్యాణ్ కుమారుడు చదువుతోన్న స్కూల్లో అగ్నిప్రమాదం జరగడం.. ఈ ఘటనలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలపాలు కావడంతో.. వెంటనే బయల్దేరాల్సిందిగా.. పవన్ కల్యాణ్‌ను కోరారట.. పార్టీ నేతలు, అధికారులు.. అయితే, ముందుగా ఫిక్స్ చేసిన షెడ్యూల్ ఉండడంతో.. కొంతవరకు కుదించారు.. మన్యం నుంచి విశాఖపట్నం రానున్న పవన్ కల్యాణ్.. అక్కడి నుంచి హుటాహుటిన సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు.. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు గాయాలు అయ్యాయి.. సింగపూర్‌లో స్కూల్లో మంటలు చెలరేగాయి.. ఈ ప్రమాదంలో.. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు అయ్యాయి..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఆక్వా ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.. అమెరికా నిర్ణయం అమల్లోకి వచ్చిన కొద్దిగంటల్లోనే రొయ్యల ధరలు దారుణంగా పడిపోయాయి.. విదేశాలకు ఎగుమతి అయ్యే రొయ్యలు ఒక్కో కేజీ కి 50 రూపాయల వరకు ధరలు పడిపోయాయి.
ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఒంటిమిట్టలో పర్యటించారు... కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంత్రుల బృందం సోమవారం సందర్శించారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్సీ బి.రాంగోపాల్ రెడ్డి, కలెక్టర్ చామకూరి శ్రీధర్ లు పాల్గొన్నారు.