మాజీ మంత్రి విడదల రజినిపై వరుసగా ఫిర్యాదులు వెళ్తున్నాయి.. మాజీ మంత్రి రజినిపై చిలకలూరిపేట పబ్లిక్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు పసుమర్రు రైతులు.. రజినితో పాటు ఆమె మామ, మరిదిపై కూడా కంప్లైట్ చేశారు..
15 ఏళ్ల పాటు కూటమి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలి.. అప్పుడే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. డుంబ్రిగూడ బహిరంగ సభలో మాట్లాడుతూ.. 15 ఏళ్ల పాటు కూటమి పాలన ఈ రాష్ట్రం లో కొనసాగాలి.. రాష్ట్రానికి మేలు చేసేలా చంద్రబాబు ఆలోచనలు చేస్తారు.
వైఎస్ జగన్.. రాప్తాడు పర్యటనపై స్పందించిన ఎమ్మెల్యే పరిటాల సునీత.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. మరోసారి తోపుదుర్తి సోదరులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె... జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే రాప్తాడు వైసీపీ టికెట్ బీసీలకు ప్రకటించాలని డిమాండ్ చేశారు.. జగన్‌ని రాకుండా ఆపే దమ్ము, ధైర్యం రెండూ ఉన్నాయి.. ఎక్కిన హెలికాప్టర్ ను దిగకుండా తిరిగి పంపే శక్తి కూడా ఉందన్నారు.. మా కార్యకర్తలు, నాయకులు కూడా అదే కోరుతున్నారు.. కానీ, మాకు సీఎం చంద్రబాబు ఇలాంటి సంస్కృతి నేర్పలేదన్నారు.
అమరావతిలో గ్లోబల్ మెడ్‌సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వైద్యం, ఆరోగ్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సీఎం.. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు.. వివిధ వ్యాధులపై వివరణ ఇచ్చారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని నియోజకవర్గాల్లో 100 పడకల ఆసుపత్రి ఉంటుంది.. దేశంలో ఉన్న అత్యుత్తమ నిపుణులు క్యాన్సర్ హార్ట్ కు సంబంధించి చికిత్సలు జరుగుతాయన్నారు.. అమరావతిలో గ్లోబల్ మెడ్‌సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని.. ప్రతీ నియోజక వర్గంలోనూ 100 - 300 పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని…
అమరావతి రాజధానికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.. రాజధాని పనుల కోసం రూ.4285 విడుదల చేసింది.. అమరావతి నిర్మాణంలో తొలిదశ కింద రూ.4285 కోట్ల విడుదల చేసింది ఎన్డీఏ సర్కార్.. ప్రపంచ బ్యాంక్ రుణంలో భాగంగా ఈ నిధుల విడుదలయ్యాయి.. అమరావతి పనుల శ్రీకారానికి ప్రధాని రాక చర్చ సమయంలో నిధుల విడుదల ప్రాధాన్యత సంతరించుకుంది..
సంబేపల్లి మండలం మోటకట్ల వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటనలో హంద్రీనీవా HNSS యూనిట్-2 పీలేరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పీజీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ రమ (50) దుర్మరణం పాలయ్యారు.. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.. పీలేరు నుండి రాయచోటి కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్ కు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.. సుగాలి రమ మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, రాంప్రసాద్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ సహా పలువురు…
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ఇక, ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ వరకు మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది..
ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షమ పథకాల విషయంలో ప్రజలు సంతోషంగా ఉన్నారా? లేదా ఏదైనా అసంతృప్తి ఉందా? అనే కోణంపై దృష్టిసారించింది ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా.. రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటుంది ప్రభుత్వం.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అయినవిల్లి జనసేనలో విభేదాలు భగ్గుమన్నాయి.. జనసేన పార్టీకే చెందిన ఓ నాయకుడుపై మండల అధ్యక్షుడు దాడి చేయడం చర్చగా మారింది.. ఇక, పార్టీ నేతపై దాడి చేసిన జనసేన పార్టీ మండల అధ్యక్షుడు రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అయినవిల్లి జనసేన నాయకుడు తొలేటి ఉమ పై రాత్రి మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ దాడి చేశాడు..
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శేషవాహనంపై శ్రీ సీతారామలక్ష్మణుల వాహనసేవ వైభవంగా సాగింది.. ఇక, ఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంత్రుల బృందం పరిశీలించనుంది.. ఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణ మహోత్సవం కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ నెల 11వ తేదీన సీఎం చంద్రబాబు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్నారు..