Kethireddy Pedda Reddy: 2019 ఎన్నికల్లో గెలిచాక పెద్దారెడ్డి ఏం చేశారో.. వాటన్నింటికీ సేమ్ అదే తరహాలోనే రివర్స్ అటాక్ మొదలవుతోంది. కొలత కాస్త ఎక్కువే ఉంటుంది కానీ.. తగ్గే ప్రసక్తే లేదని అంటున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి. అప్పట్లోనే ఏమేమి చేశారో లెక్కలు రాసుకుని మరీ వడ్డీతో సహా చెల్లించేందుకు జేసీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇప్పుడు తాజాగా పెద్దారెడ్డి ఇంటికి గురి పెట్టారు.. అసలు పెద్దారెడ్డి వైపుకు జేసీ ఎందుకు చూశారంటే.. 2023 సెప్టెంబర్‌లో అప్పటి వైసీపీ ప్రభుత్వంలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రహారీగోడను 27 లక్షలతో అధికారులు నిర్మించే ప్రయత్నం చేశారు. అది సరిగ్గా జేసీ ఇంటికి ఎదురుగా ఉంది. ఈ కాంపౌండ్ వాల్ రోడ్డులో ముందుకు వచ్చి నిర్మిస్తున్నారనే జేసీ అభ్యంతరం చెప్పారు. 2022 మాస్టర్ ప్లాన్ ప్రకారం కాలేజీ నుంచి వరకు 60 అడుగుల రోడ్ ఉందని.. ఆ మేరకు స్థలాన్ని విడి పెట్టి ప్రహరీ నిర్మించాలని సూచించారు. రోడ్డు విస్తరణ చేపడితే గోడను కూల్చేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Viral Video: ప్రాక్టీస్ సెషన్‌లో WWE.. బౌలింగ్ కోచ్‌తో కుస్తీ పడిన టీమిండియా బౌలర్లు..
అనుకున్నట్టుగానే అప్పట్లో జూనియర్ కాలేజీ కాంపౌండ్ వాల్ ధ్వంసం చేశారు. అది ఎవరు చేశారో తెలియదు.. కానీ, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తోపాటు మరో 13 మందిపై కూడా కేసులు నమోదు చేశారు. కాంపౌండ్ వాల్ నిర్మాణంపై ఏకంగా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు జేసీ.. దీంతో నిర్మాణం ఆగిపోయింది. అయితే, తాజాగా ఇప్పుడు టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా వ్యవహరాలు సాగుతున్నాయి. పెద్దారెడ్డి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి.. ఇళ్లు నిర్మించారని జేసీ ప్రభాకర్ రెడ్డి గత కొన్ని రోజులుగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఆక్రమణలంటూ పట్టణంలో వైసీపీ నాయకులే టార్గెట్ కూల్చివేతలు, నోటీసులు ఇచ్చే ప్రక్రియ సాగుతోంది. తాజాగా, ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉంటున్న ఇంటితో పాటు సమీపంలోని పలు ఇళ్లకు సంబంధించిన కొలతలు వేశారు.
Read Also: Dil raju Dreams : దిల్ రాజు డ్రీమ్స్ వెబ్‌సైట్ పై.. అనిల్ రావిపూడి షాకింగ్ రియాక్షన్!
తాడిపత్రి మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు లోని సర్వే నెం.639, 640 మరియు 641లో గల ప్లాట్ నెంబర్ 1 నుండి 16లోని సంబధించిన ఆక్రమణకు గురైన మున్సిపాలిటీ స్థలంను కొలతలు వేశారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ మున్సిపల్ సర్వే అధికారులు, రెవెన్యూ సర్వేయర్ దాదాపు రెండు గంటల పాటు సర్వే చేశారు. పెద్దారెడ్డి కొనుగోలు చేసిన స్థలానికి, ఇల్లు నిర్మించిన స్థలానికి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయా..? లేవా..? అన్నది రెండు రోజుల్లో మున్సిపల్ సర్వే అధికారులు నివేదికను మున్సిపల్ కమిషనర్‌కు అందజేస్తామని చెబుతున్నారు.. అయితే, ఇప్పటికే మున్సిపల్ అధికారులు ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో, సర్వే అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై చర్యలు ఉంటాయని తెలుస్తోంది. మొత్తం మీద అప్పుడు జేసీ ఇంటి ముందు కాలేజ్ కాంపౌండ్ వాల్ నిర్మించాలని పెద్దారెడ్డి చూస్తే.. ఇప్పుడు పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారుల ద్వారా ఎసరు పెట్టారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పరిణామాలు గతంలో లాగానే ఉద్రిక్తలకు దారి తీస్తాయేమోనన్న ఆందోళన కనిపిస్తోంది.