Kalyandurg E-Stamp Scam: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఈ-స్టాంపుల కుంభకోణాన్ని అనంతపురం జిల్లా పోలీసులు ఛేదించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ముఖ్య అనుచరుడు ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్.. ఎస్ఆర్సీ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో నకిలీ ఈ స్టాంప్ బాగోతం బయటపడిందని తెలిపారు. ఎస్ఆర్సీ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదుతో కళ్యాణదుర్గంలో మీసేవ నిర్వహిస్తున్న బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు సహా ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. నిందితుడు బోయ ఎర్రప్ప ఇప్పటివరకు దాదాపు 15,851 ఈ స్టాంపులను అమ్మినట్లు గుర్తించామన్నారు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వంద రూపాయల ఈ స్టాంపులను కొనుగోలు చేసి ఫొటోషాప్ లో లక్ష రూపాయల నకిలీ ఈ స్టాంపులుగా నిందితుడు మీసేవ బాబు మార్చాడని పేర్కొన్నారు..
Read Also: బ్లాక్ బికినీలో దర్శనమిచ్చిన.. శ్రద్ధా శ్రీనాథ్
నిందితుడు మీసేవ బాబు నుంచి కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుకు చెందిన ఎస్ఆర్ కన్ స్ట్రక్షన్ సంస్థ దాని అనుబంధ సంస్థలకు 438 నకిలీ ఈ-స్టాంపులను ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు విక్రయించినట్లు గుర్తించాం. నిందితుల నుంచి మూడు సీపీయూలు, మూడు మానిటర్లు, మూడు ప్రింటర్ కం స్కానర్లు, రెండు ప్రింటర్లు, ఒక ల్యాప్‌టాప్, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని.. అలాగే, 88 కాలీ ఈ స్టాంపులను అలాగే వాడిన ఏడు ఈ స్టాంప్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు బాధితులు ఎవరైనా ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ జగదీష్ చెప్పారు.
ఇక, ఈ స్టాంపు కుంభకోణం నిందితులు మొత్తం రెండు కోట్ల రూపాయల వరకు లావాదేవీలు చేసినట్లు గుర్తించినట్టు ఎస్పీ తెలిపారు.. ఇంకా 15 వేల 413 ఈ స్టాంప్ పేపర్లు వెరిఫై చేయాల్సి ఉందని.. నిందితుల నుంచి 88 ఖాళీ ఈ స్టాంప్ పేపర్లు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.. ఎర్రప్ప కేవలం 6 లక్షల స్టాంప్ డ్యూటీ ప్రభుత్వానికి కట్టి.. దాదాపు 25 లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు స్టాంప్ డ్యూటీ ప్రభుత్వానికి కట్టలేదన్నారు.. ఇంకా ఎవరైనా ఎర్రప్ప దగ్గర ఈ- స్టాంప్ లు కొనుగోలు చేసి మోసపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.. తన అకౌంట్ లోకి వచ్చిన డబ్బును ఎర్రప్ప విత్ డ్రా చేసుకున్నాడు.. ప్రస్తుతం ఎర్రప్ప బ్యాంకు ఖాతాల్లో లక్ష రూపాయలు కూడా లేవన్నారు ఎస్పీ జగదీష్..