భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. మాకు తెలియకుండా ఎవరైనా పదవులు తెచ్చుకుంటే వారిని నియోజకవర్గంలో కూడా అడుగుపెట్టనివ్వం అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.. పదవులు ఇవ్వాలనుకుంటే మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి మాత్రమే ఇవ్వండి అని సూచించారు.. లేకపోతే అసలు పని చేయని వాళ్లకి పదవులు ఇస్తే అది కరెక్ట్ కాదు అని హితవుచెప్పారు..
వైసీపీ ఐదేళ్ల పాలనలో వేల ఎకరాలు భూదందా చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అన్న మయ్య జిల్లా మదనపల్లె శివారులోని బీకే పల్లెలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వే చేసి కబ్జా అయిన భూమిని స్వాధీనం చేసుకున్నారు
దేశవ్యాప్తంగా భారీ పేలుళ్ల కుట్నను తెలంగాణ, ఏపీ పోలీసులు భగ్నం చేసిన విషయం విదితమే.. విజయనగరంలో ఒకరిని, హైదరాబాద్‌లో మరొకరని అరెస్ట్ చేశారు పోలీసులు.. ఈ కేసులో ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది.. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్‌లో విస్తుపోయే విషయాలు వెలుగు చూడగా.. ఉగ్రవాద భావజాలం కలిగిన సిరాజ్ నుంచి అనేక ఆసక్తికర విషయాలు సేకరించారు పోలీసులు.. సిరాజ్ నాలుగు టార్గెట్లు పెట్టుకున్నట్టు పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం.. దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి.. యువతను మతోన్మాదులుగా మార్చాలి..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరుగునుంది... ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కేబినెట్లో చర్చిస్తారు... వచ్చే నెలలో అమలు చేసే తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి కూడా కేబినెట్లో చర్చ జరగనుంది.. ఎస్ఐపీబీ ఆమోదించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది..
అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అనకాపల్లి జిల్లా యంత్రాంగంపై విరుచుకుపడ్డా ఆయన.. అనకాపల్లి జిల్లా అవినీతి యంత్రాంగాన్ని ఉరి తీసినా తప్పులేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు ఐసీస్ చేసిన కుట్రను భగ్నం చేశారు తెలుగు రాష్ట్రాల పోలీసులు.. ఇద్దరు విద్యార్థులకు తమ వైపు తిప్పుకొని పేలుళ్లకు పక్కా స్కెచ్ వేశారు.. హైదరాబాద్‌కు చెందిన సమీర్, విజయనగరానికి చెందిన సిరాజ్‌లతో పేలుళ్లకు ప్లాన్ చేశారు.. ఐసీస్ ఉచ్చులో పడి హైదరాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు ప్లాన్ చేశారు యువకులు.. దీనికోసం ఆన్లైన్ ద్వారా పేలుడు పదార్థాలను కొనుగోలు చేశారు సిరాజ్, సమీర్.. ఈ నెల 21, 22వ తేదీల్లో విజయనగరంలో డమ్మీ ప్లాస్టిక్ ప్లాన్ చేశారు..
ప్రభుత్వ భూములు ఆక్రమించాలన్న ఆలోచన మానుకోవాలి.. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి పొంగూరు నారాయణ..
నకిలీ పట్టాల పంపిణీ కేసు వ్యవహారంలో వంశీ బెయిల్ పిటిషన్ పై నేడు ఏలూరు జిల్లా నూజివీడు కోర్టులో విచారణ జరిగింది.. నకిలీ పట్టాల పంపిణీ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కీలక ఆదేశాలు జారీ చేసింది నూజివీడు రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జీ కోర్టు.