ప్రతీ చర్యకు.. ప్రతిచర్య ఉంటుంది అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడతాడే, అంతే వేగంతో అదిపైకి లేస్తుందన్నారు.. ప్రజలకు మంచి చేయడమే ప్రజాస్వామ్యం. అధికారం ఉందని దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు కచ్చితంగా తిప్పికొడతారని.. వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్తారని హెచ్చరించారు..
విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం.. ఈ సిద్ధాంతాన్ని నేను గట్టిగా నమ్ముతాను అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కేవలం ఇచ్చిన మాటకోసం.. ఎందాకైనా వెళ్లాం.. ఆ ప్రస్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. బలమైన పార్టీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎదిగింది. ఆరోజు నుంచి నాతోనే మీరంతా అడుగులు వేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ నాతోనే ఉన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం. విలువలకు, విశ్వసనీయతకు అర్థం చెప్పిన పార్టీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నారు..…
ఏపీ మున్సిపల్ కమిషనర్ల ఒకరోజు వర్క్ షాపు విజయవాడలో జరుగుతోంది.. వర్క్ షాప్ కు హాజరైన మంత్రి నారాయణ మాట్లాడుతూ మునిసిపల్ కమిషనర్లు రెవెన్యూ పై దృష్టిపెట్టాలని అన్నారు.. అలాగే కలెక్షన్లు లేకపోతే ఏమీ చేయలేం అన్నారు.. ఏ మునిసిపాలిటీ కలెక్షన్ ఆ మునిసిపాలిటీలోనే వినియోగించుకునేలా అవకాశం ఇచ్చారు.. వచ్చే మార్చి నాటికి 80 శాతానికి పైగా కలెక్షన్లు జరిగిపోవాలన్నారు..
రామగిరి మండలంలో వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం క్లియర్ గా కనిపించిందని వ్యాఖ్యానించారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. హెలికాప్టర్‌ను ఇబ్బందులకు గురిచేసి.. మార్గమధ్యలో జగన్‌పై భౌతిక దాడి చేయాలనే కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత.. ఇంటెలిజెన్స్ సంస్థల రిపోర్టుల ప్రకారం అత్యధిక థ్రెట్ ఉన్న నేత కూడా జగనే అన్నారు.
విశాఖపట్నంలో మరో ప్రేమోన్మది రెచ్చిపోయాడు.. మధురవాడలో ప్రేమోన్మాది దాడి ఘటన మరువక ముందే.. మరో ఘటనతో విశాఖ నగరం ఉలిక్కిపడింది.. తాజా ఘటన ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.. గాజువాకకు చెందిన యువకుడు.. అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన బాలికను ఏడాది నుంచి ప్రేమిస్తున్నాడు.. వీరిద్దరూ ఇంటర్ చదువుతున్నారు.. ఈ విషయం బాలిక ఇంట్లో తెలిసిపోవడంతో బాలికకు వేరే పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు.
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.. సూళ్లూరుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలపై క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు పోసాని కృష్ణమురళి.. అయితే, పోసాని పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. కేసుపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ స్టే ఇచ్చింది.
మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు.. ఆరు బృందాలతో తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు.. కాకాణిపై నమోదైన కేసుల విషయంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో అప్రమత్తమైన పోలీసులు.. ముందు జాగ్రత్త చర్యగా.. కాకాణి గోవర్ధన్‌రెడ్డి విదేశాలకు వెళ్లకుండా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు..
రేపు ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణోత్సవం జరగనుంది.. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 మధ్య పండు వెన్నెలలో పౌర్ణమి రోజున రాముల వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు.. సీతారాముల కల్యాణోత్సవానికి సర్వం సిద్ధం చేసింది టీటీడీ.. భక్తులకు పంపిణీ చేయడానికి లక్ష ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లు సిద్ధం చేశారు..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ.. తమ పార్టీ బలోపేతంపై దృష్టిసారించింది.. దాని కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకుని అమలు చేస్తోంది.. అందులో భాగంగా.. ఏపీలో బీజేపీ ఇవాళ్టి నుంచి గ్రామాల్లో పర్యటించేలా గావ్ ఛలో అభియాన్ కార్యక్రమం మొదలుపెట్టనుంది.