Union Minister Rammohan Naidu: ఉద్దానం పేజ్ -2 మంచినీటి పథకానికి శంకుస్థాపన.. ఆ సంస్కృతి మాది కాదు..!
- శ్రీకాకుళం జిల్లాలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటన..
- పాతపట్నంలో రూ.265 కోట్లతో ఉద్దానం పేజ్-2 మంచినీటి పథకానికి శంకుస్థాపన..
- ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేసి సంస్కృతి మాది కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Minister Rammohan Naidu: ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేయడం వంటి సంస్కృతి మా కూటమి ప్రభుత్వానికి లేదన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు.. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన.. పాతపట్నంలో 265 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఉద్దానం పేజ్ – 2 మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు.. పాతపట్నం నియోజకవర్గంలోని బూరగాం గ్రామంలో 265 కోట్ల రూపాయలతో ఉద్దానం పేజ్ -2 మంచినీటి పథకం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వం లాగా ఇసుక మాఫియా, భూధందాలు, లిక్కర్ మీద సొమ్ము చేసుకోవడం లేదన్నారు.. ప్రభుత్వాన్ని ఎదిరిస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేయడం వంటి సంస్కృతి కూడా మా కూటమి ప్రభుత్వానిది కాదన్నారు.. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు స్వాతంత్రం వచ్చేటట్లుగా స్వేచ్ఛగా ప్రభుత్వ పథకాలు పొందుతున్నారని పేర్కొన్నారు.. ప్రజలు ఎవరైనా సమస్యలు పరిష్కరించుకుంటే మమ్మల్ని అక్కడికక్కడే నిలదీస్తే మేం వారిపై ఎటువంటి అధికార జులుం ప్రదర్శించకుండా.. సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు.
Read Also: Pregnant Woman: మహరాష్ట్ర ఆస్పత్రిలో దారుణం.. గర్భిణీ పొత్తికడుపుపై యాసిడ్..
Also Read
- Dharmana Prasada Rao: స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఏం చేస్తారో చూపించండి.. ధర్మాన సవాల్
- Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
మరోవైపు, శ్రీకాకుళం జిల్లాలో ఇండియా టర్న్స్ పింక్ సంస్థ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా CSR ద్వారా మహిళలకు ఉచిత బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.. ఈ కార్యక్రమం ద్వారా శ్రీకాకుళం జిల్లాలోని 10,000 మంది గ్రామీణ మహిళలకు ఉచితంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సదుపాయం కల్పించబడుతుంది. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం మహిళలో అవగాహన పెంపొందించి క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం, తద్వారా జీవితాలను రక్షించడం అన్నారు.. ఈ కార్యక్రమంలో నాతో పాటు AAI చైర్మన్ విపిన్ కుమార్, HR సభ్యులు శ్రీనివాస్, ఇండియా టర్న్స్ పింక్ అధికారులు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యేలు గొండు శంకర్ మరియు బగ్గు రమణ మూర్తి పాల్గొన్నారు. గ్రామీణ సమాజాలలోని మహిళలకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ మరియు ముందస్తు రోగ నిర్ధారణ సేవలను అందించేందుకు మేం కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు…
తాజావార్తలు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?