అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.. గత ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన సుగవాసి బాలసుబ్రమణ్యం.. ఇప్పుడు, టీడీపీకి గుడ్‌బై చెప్పారు.. తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పంపారు సుగవాసి బాలసుబ్రమణ్యం..
రాజంపేట నియోజకవర్గం టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు రచ్చ కెక్కాయి. రాజంపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ బత్యాల చెంగల రాయుడు కు ఇవ్వాలని మోకాళ్లపై కూర్చొని నినాదాలు చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వాన్ని నిలదీస్తూ దీనిపై సోషల్ మీడియాలో వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.. చంద్రబాబు పాలనలో వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. రాజకీయ కక్షలతో చంద్రబాబు, ఆయన పార్టీనాయకులు చేస్తున్న నేరపూరిత చర్యలు, ఆలోచనల కారణంగా.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ, భద్రత లేకుండా పోయింది.
కృష్ణా, గోదావరి డెల్టాలో పంటల సాగు వెంటనే చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాన్లు కంటే ముందుగానే పంటలు చేతికొచ్చేలా పంటల సాగు కాలంలో మార్పులు తీసుకురావాలని సూచన చేశారు. భూగర్భ జలాలు పెంచడం, రిజర్వాయర్లు నింపడం, జలవనరుల సమర్ధ వినియోగం.. ఈ 3 అంశాలపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టాలని సూచించారు. 365 రోజులు భూమి పచ్చగా ఉండేలా... 3 పంటలు నిరంతరం పండించేలా చూడాలన్నారు.
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
రేషన్ బదులు నగదు ఇచ్చే విషయంపై కసరత్తు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న పద్ధతులకు సంబంధించి అధ్యయనం చేస్తోందట.. గతంలో పాండిచ్చేరి ప్రభుత్వం అమలు చేసిన వివరాలు సేకరిస్తున్నారు అధికారులు.. ఒక వేళ రేషన్ బదులుగా నగదు ఇస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి అందే సహకారంపై కూడా దృష్టి సారించింది ఏపీ ప్రభుత్వం..
విద్యార్థులను మరింత ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా 2024-25 విద్యాసంవత్సరానికి గానూఉత్తమ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.. టెన్త్, ఇంటర్ లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ షైనింగ్ స్టార్స్ అవార్డులు అందించనున్నారు.. ఇక, షైనింగ్ స్టార్ అవార్డులు ఇచ్చేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది ఏపీ పాఠశాల విద్యాశాఖ.