కాపు ఉద్యమనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ముద్రగడ పద్మానాభం క్యాన్సర్తో బాధపడుతున్నారట.. ఈ విషయం తెలిసి.. తన తండ్రిని కలిసేందుకు వెళ్లిన ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతిని అడ్డుకున్నారట కుటుంబ సభ్యులు.. ముద్రగడను కలిసేందుకు ఆయన కుమారుడు గిరి నిరాకరించాడట.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. పార్టీ నేతలు, క్యాడర్ అంతా ఒకే బాట, ఒకే మాట. ఇపుడు ఆ పరిస్థితి లేదు.. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డికి వ్యతిరేక వర్గం పుట్టుకొచ్చింది. ప్రతీ సందర్భంలోనూ ఆయన్ను టార్గెట్ చేయడంతో పార్టీలో అసంతృప్తి బయటపడింది. పార్టీకి నిత్యం వెన్నంటి వుండే ద్వితీయ శ్రేణి టీడీపీ సీనియర్ నాయకులంతా సైలెంట్ అయిపోవడం, కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు పెత్తనం చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చర్చించుకుంటున్నారు.
రైతు సమస్యలపై ఫోకస్ పెంచింది ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం.. తాజాగా పొగాకు, మామిడి, కోకో కొనుగోళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పొగాకు రైతుల సమస్యలకు చెక్ పెట్టేందుకు మార్క్ ఫెడ్ నుంచి కొనుగోలు చేయడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పై తాజాగా కేసు నమోదు చేశారు పోలీసులు.. వైసీపీ అధిష్టానం పిలుపుమేరకు వెన్నుపోటు దినం పేరిట పార్టీ శ్రేణులతో కలిసి మొలకలచెరువులో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి.. 300 మందితో ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చారు మొలకలచెరువు పోలీసులు.
విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు సందీప్ మాధుర్ను జీఎంగా నియమించింది రైల్వే బోర్డు.. ఈ మేరకు గురువారం రోజు ఉత్తర్వులు జారీ చేశారు.. ఢిల్లీ రైల్వే సిగ్నల్ ఆధునికీకరణ ప్రాజెక్టు సారథిగా ఉన్న సందీప్ మాధుర్ కు సౌత్ కోస్ట్ రైల్వే బాధ్యతలు అప్పగించారు.. దీనిపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్వాగతించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సందీప్ మథూర్కు శుభాకాంక్షలు తెలుపుతూనే.. దీనికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు పవన్…
రియల్ ఎస్టేట్ మరో మూడేళ్ల దాకా లేవదని అంచనా. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా దేశం, ప్రపంచం ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ కు సానుకూల సంకేతాలు కనిపించడం లేదు. హైదరాబాద్ లో కొత్త నిర్మాణాలు కూడా చాలావరకు నిలిచిపోయాయి. కేవలం టాప్ కంపెనీలు మాత్రమే అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ మేనేజ్ చేస్తున్నాయి.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీది వేముల వద్ద వైసీపీ మాజీ ఎంపీటీసీ రమేష్ ను దారుణంగా హత్య చేశారు. దుండగులు బండ రాయితో తలపై కొట్టి చంపారు. కర్నూలు నుంచి బైక్ పై సొంతూరు మీదివేములకు వెళ్తుండగా కాపుకాచి హత్య చేశారు. హత్యకు రాజకీయపరమైన కారణాల, వ్యక్తిగత కారణాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. దగ్గు జలుబుతో ఆసుపత్రికి చేరిన వారికి కరోనా టెస్టులు చేయడంతో ఒకేసారి 6 కేసులు బయటపడ్డాయి. కరుణ లక్షణాలు తక్కువగా ఉండడంతో ఐదుగురిని హోమ్ ఐసోలేషన్ పంపిన వైద్యులు.. మరో ఒకరికి నెల్లూరులోని కరోనా వార్డులో చికిత్స అందిస్తున్నారు.