వైసీపీ మహిళా విభాగం కీలక నిర్ణయం తీసుకుంది.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ మహిళా విభాగం.. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైనా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదని ఆరోపిస్తోంది.. అందుకు నిరసనగా జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం..
నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా.. వాటి మందగమనంతో.. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి.. కొన్ని ప్రాంతాల్లో వర్షలు.. మరికొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. ఇక, ఏపీలో మరో రెండు రోజుల పాటు ఉక్కపోత, గరిష్ట ఉష్ణోగ్రతలు.. మరోవైపు వర్షాలు తప్పువు అని హెచ్చరిస్తోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ..
అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీప్రాంతం సీలేరు నుండి గోకవరం వెళ్లే ఆర్టీసీ బస్సులో రోజ్ వుడ్ కలప మంచాలను పుష్ప సినిమా తరహాలో తరలిస్తున్నారు. పుష్ప సినిమా తరహాలో విలువైన కలపను తరలించారు స్మగ్లర్లు..
జగన్ రెడ్డిని దేవుడు కూడా క్షమించడు అంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విరుచుకుపడ్డారు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును జగన్ రెడ్డి ఖండించడంతో ఆడపడుచుల పట్ల ఆయనకున్న ఆలోచనలు బయటపడ్డాయన్న ఆయన.. విశ్లేషకుడిగా కృష్ణంరాజు తెలుగు ఆడపడుచుల గురించి నీచాతినీచంగా, క్రూరంగా మాట్లాడుతుంటే ఆ క్షణమే ఖండించి, క్షమాపణ చెప్పించి, డిబేట్ నుంచి బహిష్కరించాల్సిన బాధ్యత కొమ్మినేనితో పాటు యాజమాన్యానికి లేదా..? అని ప్రశ్నించారు.
ఉపాధి హామీ పథకం పనుల కోసం 176.35 కోట్ల రూపాయల నిధుల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది.. 2025-26 ఏడాదిలో తొలి విడతగా మంజూరు చేసిన కేంద్ర నిధులను.. ఉపాధి హామీ పథకం పనుల కోసం విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. నిబంధనల మేరకు నిధులు వినియోగానికి చర్యలు తీసుకోవాలని ఏపీ పంచాయతీరాజ్ డైరెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి.. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు
ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారానికి ఒడిగట్టారు కామాంధులు.. రెండేళ్లుగా బాలిక శరీంపై దాడులు చేస్తూ.. అనేక రకాలుగా చిత్రహింసలకు గురిచేశారు.. ఇక, రెండేళ్లు మౌనంగా ఆ కామాంధుల శారీరక, మానసిక హింసను భరిస్తూ వచ్చిన ఆ బాలక.. తట్టుకోలేక చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చినట్టు అయ్యింది..
టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారిపోయింది.. ఇతర పార్టీ నాయకులు టీడీపీలోకి జాయిన్ చేసుకునే ముందు తప్పనిసరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి.. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం ఇతర పార్టీల నాయకులను జాయిన్ చేసుకోవాలి.. వాళ్లపై విచారణ తర్వాత పార్టీ అనుమతితో పార్టీలోకి ఆహ్వానించాలని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది..