AP Crime: చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం చోటు చేసుకుంది.. 18 నెలల బాలుడిపై పైశాచికత్వంగా కొట్టడమే కాకుండా మర్మంగాలపైన.. శరీర భాగాల పైన విచక్షణ రహితంగా కొరికి గాయాలు చేశాడు మరో మైనర్ బాలుడు… రోజువారి పనులు కోసం వెళ్తున్న సమయంలో పక్క ఇంట్లో 13 ఏళ్ల బాలుడిని నమ్మి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది… గంగవరం మండలం వత్తికొండ వద్ద ఓ కోళ్ల ఫామ్‌లో ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఓ జంట పనిచేస్తున్నారు. వీరికి ఏడాదిన్నర బాలుడు ఉన్నాడు. ఆ బాలుడినిపై మైనర్ బాలుడు ఎందుకు అంతటి విచక్షణారహితంగా దాడి చేశారని పోలీసులు విచారిస్తున్నారు. గాయాలపాలైన బాలుడిని తల్లిదండ్రులు వెంటనే పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.. ఆసుపత్రిలో వైద్యులు విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.. ఐసీయూలో వుంచి చికిత్స చేస్తున్నారు. బాలుడు కోమాలోకి వెళ్లినట్టు వైద్యులు చెబుతున్నారు.. ఇది సాధారణంగా వచ్చిన వ్యాధి కాదని.. బాలుడిని ఎవరో విచక్షణా రహితంగా కొట్టారని, దీంతో బాలుడు తీవ్రగాయాల పాలయ్యాడని తెలిపారు వైద్యులు. విషయం తెలుసుకున్న హ్యూమన్రెట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ మాదేశ్ బృందం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 13 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్