AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం
- లిక్కర్ స్కాం కేసులో సిట్ చార్జ్‌షీట్‌పై ఏసీబీ కోర్టు అభ్యంతరాలు..
- సుమారు 21కి పైగా అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఏసీబీ కోర్టు..
- 3 రోజుల్లో అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు ఆదేశం..
- లిక్కర్ స్కాం కేసులో ఇప్పటి వరకు 2 చార్జిషీట్లు దాఖలు చేసిన సిట్..
- జూన్ 19 ప్రైమరీ, ఆగస్ట్ 11 రెండో అదనపు చార్జి షీట్ దాఖలు చేసిన సిట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Liquor Scam Case: ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు సోమవారం రోజు సిట్‌కు ఝలక్ ఇచ్చింది. లిక్కర్ స్కాం కేసులో సిట్ దాఖలు చేసిన చార్జిషీట్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది. రెండు ఛార్జ్‌షీట్లలో 21కి పైగా అభ్యంతరాలు తెలిపారు న్యాయమూర్తి. నిందితులు అందరికీ ముద్దాయి కాపీలు అందజేశారా..? అని ప్రశ్నించారు. ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం ఎలా అప్లయ్ అవుతుందో చెప్పాలని అడిగారు. ఈ కేసులో సిట్ ఎంత మందిని సాక్షులుగా విచారించిందో వివరాలు ఇవ్వాలని కోరారు. ఎంత మంది సాక్షుల దగ్గర 164 స్టేట్‌మెంట్ రికార్డు చేశారని ప్రశ్నించింది ఏసీబీ కోర్టు. మధ్యవర్తుల రిపోర్టులు, సీజర్ రిపోర్టులు సమర్పించాలంది. మరోవైపు, ఏపీ లిక్కర్ స్కాం కేసులో నేడు 12 మంది నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు సిట్ అధికారులు..
Read Also: ADB CASHIER BAGOTHAM : 402 ఖాతాల్లోని బంగారం ఎక్కడికి పోయింది.? చెన్నూర్ SBIలో ఏమైందో తెలుసా.?
Also Read
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్‌లో FIR, రిమాండ్ రిపోర్ట్, ఛార్జ్‌షీట్ చూపించాలని కోరింది. సాక్షులు, డాక్యుమెంట్లను తగిన విధంగా సమర్పించాలని.. ఛార్జ్‌షీట్‌ల ఓచూపించిన డాక్యుమెంట్లకు CF నంబర్లు చూపించాలని కోర్టు ఆదేశించింది. రెండు చార్జిషీట్లలో ప్రిలిమినరీ లేదా ఫైనల్ చార్జీషీట్ అని చెప్పలేదన్నారు న్యాయమూర్తి. FSL రిపోర్టులు ఇంకా ఫైల్ చేయకుండా ఛార్జ్‌షీట్ ఎలా అర్హత పొందుతుందని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్‌లో 3500 కోట్లు ఎలా ట్రాన్స్‌ఫర్ అయ్యాయో టేబుల్ రూపంలో చూపాలన్నారు. కేసులో ఏడు నుంచి 15 వరకు ఉన్న నిందితులను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని కూడా ప్రశ్నించారు. స్కామ్‌లో వారి పాత్రను స్పష్టం చేయాలన్నారు. ప్రతి ముద్దాయికి ఏ సెక్షన్ వర్తిస్తుందో స్పష్టంగా చెప్పాలన్నారు. ఈ కేసులో ఎంత మంది అరెస్ట్ అయ్యారు… ఎన్ని రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారనే వివరాలు ఇవ్వాలన్నారు. అభ్యంతరాలపై మూడు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. మర
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!