సభ్య సమాజం తల దించుకునేలా నా పై జరిగిన మాటల దాడిని ఖండిస్తూ నాకు అండగా నిలబడిన తెలుగుదేశం కుటుంబసభ్యులకు, ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ ఓ వీడియో విడుదల చేశారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి..
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో రెండో రోజు శాకంబరి దేవి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు మంగళవారం రోజు ప్రారంభం కాగా.. ఈ నెల 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్నాయి. రెండవ రోజు అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక, రేపటితో ఈ శాకంబరీ మహోత్సవాలు ముగియనున్నాయి..
వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చిత్తూరు జిల్లా పర్యటనపై హైటెన్షన్ నెలకొంది. బంగారుపాళ్యం మ్యాంగో మార్కెట్ యార్డు చిన్నది కావడంతో కేవలం 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు పోలీసులు.. అంతేకాదు, ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి లేదని ఎస్పీ మణికంఠ తెలిపారు. మరోవైపు పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ బెంగుళూరు నుంచి చిత్తూరు జిల్లా పర్యటనకు రాబోతున్నారు వైఎస్ జగన్?. మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో వారిని పరామర్శించేందుకు బంగారుపాళ్యం మామిడి మార్కెట్లో నేరుగా రైతులతో మాట్లాడబోతున్నారు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశ జరగనుంది.. రాజధాని లో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్.. 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా ఆమోదం తెలపనుంది.. రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్కు అనుమతి ఇవ్వనుంది కేబినెట్..
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపాయి.. ఈ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి అనిత.. ప్రసన్నకుమార్ రెడ్డిని వెంటనే వైసీపీ నుంచి సస్పెండ్ చేయండి అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సలహా ఇచ్చారు.
మరో 6 నెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కాబుతోంది.. పెట్టుబడులతో రండి.. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం అంటూ జీసీసీ గ్లోబల్ లీడర్ల రోడ్షోలో పిలుపునిచ్చారు ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు..
వైఎస్ జగన్ ప్రభుత్వ వైఖరి కారణంగా వ్యవసాయ రంగానికి, రైతులకు అనేక చిక్కుముడులు ఏర్పడ్డాయని విమర్శించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. వైఎస్ జగన్ హయాంలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింది.. రైతాంగం అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారన్నారు.