కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ను కలిసిన మంత్రి నారా లోకేష్.. పండ్లతోటల అభివృద్ధికి అన్నివిధాల అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని చిరాగ్ పాశ్వాన్ కు మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ తో మంత్రి లోకేష్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... రాయలసీమలో రైతులు మామిడి, అరటి, టమోటా, బత్తాయి, దానిమ్మ, డేట్స్ వంటి పండ్లతోటలను పెద్దఎత్తున సాగు చేస్తున్నారు. అయితే పంట చేతికొచ్చే…
కోల్కతాలో కొడాలి నానిని అరెస్ట్ చేశారనే వార్తలు హల్చల్ చేశాయి.. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చారు కృష్ణా జిల్లా పోలీసులు.. కొడాలి నాని అరెస్టు అని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్త అవాస్తవమని తేల్చారు జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు.. మాజీ మంత్రి కొడాలి నానిపై ఉన్న కేసుల నేపథ్యంలో ఆయనున్న కోల్కతా ఎయిర్పోర్ట్లో అరెస్టు చేశారంటూ సోషల్ మీడియా వేదికగా వస్తున్న వార్తలు అవాస్తవం... అలా ప్రచురితం అవుతున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని జిల్లా ఎస్పీ గంగాధరరావు తెలియజేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై షాకింగ్ కామెంట్స్ చేశారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవమేనన్న ఆమె.. నా ఫోన్, నా భర్త ఫోన్, నా దగ్గరివాళ్ల ఫోన్లు ట్యాప్ చేశారని.. అసలు, ఫోన్ ట్యాప్ జరిగినట్లు స్వయంగా వైవీ సుబ్బారెడ్డి నాకు చెప్పారని తెలిపారు.. ఆనాడు ట్యాపింగ్ జరిగిన నా ఆడియో ఒకటి నాకే వినిపించారని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మని చెప్పినా వస్తానని వెల్లడించారు వైఎస్ షర్మిల..
ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడపుతున్నారు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. ఇక, ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.. 25 నిమిషాలకు పైగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలతో పాటు.. తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది.. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను…
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చి ఏడాది పూర్తయింది. దీంతో... ఈ టైంలో మనోళ్ళు ఏం చేశారు? నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? జనానికి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు? ఘనకార్యాలు వెలగబెడుతున్నదెవరంటూ... ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకుంటున్నారట సీఎం చంద్రబాబు. కేవలం రిపోర్ట్లు తీసుకోవడానికే పరిమితం అవకుండా... కాస్త తేడాగా అనిపించిన ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్స్ కూడా ఇస్తున్నారట ఆయన.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన కలకలం రేపుతోంది.. బాధితురాలికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు సీఎం చంద్రబాబు, బాధితురాలి పిల్లలు చదువుకోవడానికి చర్యలు తీసుకుంటామన్నారు.. రూ.5లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు.. అయితే, ఈ ఘటనపై స్పందించిన కేఏ పాల్.. నేను మహిళను కొట్టిన వారిపై 302 కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను.. ప్రభుత్వం సరైన చర్య తీసుకోకపొతే నేను రంగంలోకి దిగుతాను అని ప్రకటించారు.
బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య, పెండెం దొరబాబు.... అందరూ అందరే. అంతా సీనియర్ లీడర్సే. కొందరు రాష్ట్ర స్థాయిలో, కొందరు నియోజకవర్గంలో చక్రాలు తిప్పేసిన వారే. అంతకు ముందు వైసీపీలో ఉన్నప్పుడు వాయిస్ రెయిజ్ చేసిన వారే. కానీ... కాలం మారింది. పరిస్థితులు మారిపోయాయి.... సదరు లీడర్స్ స్వరాలు మూగబోయాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఫుల్ వాల్యూమ్లో ఫ్యాన్ కిందినుంచి పక్కకు వచ్చేసి టీ గ్లాస్ పట్టుకున్నారు ఈ నేతలంతా.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నాలుగు దశాబ్దాలకు పైగా టిడిపితో అనుబంధం ఉన్న నల్లమిల్లి... తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఈసారి కాషాయ కండువా కప్పుకున్నారు. రామకృష్ణారెడ్డి తండ్రి నల్లమిల్లి మూలారెడ్డి టిడిపి ఆవిర్భావం నుంచి కొనసాగుతూ అదే పార్టీ తరపున నాలుగు సార్లు అనపర్తి ఎమ్మెల్యేగా గెలిచారు.