Speaker Ayyanna Patrudu: అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతోంది.. అయితే, ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు శాసన సభ సమావేశాలకు వస్తారా? రారా? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు.. అయితే, దమ్ముంటే సభకు రావాలంటూ సీఎం చంద్రబాబు సవాల్ చేయడం.. సభకు వచ్చేందుకు సిద్ధమే.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ కౌంటర్ ఇవ్వడం జరిగిపోయాయి.. ఈ నేపథ్యంలో.. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. వైఎస్ జగన్, ఆయన ఎమ్మెల్యేలు సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు.. అంతేకాదు, సభాపతిగా ఎమ్మెల్యేలందరికీ సమాన అవకాశం కల్పిస్తానని పేర్కొన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.
Read Also: Irfan Pathan: హుక్కా తాగే వాళ్లకే జట్టులో చోటు.. ఎంఎస్ ధోనీపై ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు!
మరోవైపు, వైఎస్ జగన్ అసెంబ్లీకి సిద్ధమా అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన సవాల్ ను ఎక్స్ లో ప్రస్తావించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. జగన్ కు ప్రతిపక్ష హోదా కావాలంటూ మాట్లాడుతుండటాన్ని తప్పుబట్టిన ఆయన.. ప్రతిపక్ష హోదా నిబంధనలపై తాను ఇప్పటికే స్పష్టత ఇచ్చానంటూ పేర్కొన్నారు.. కాగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ఇప్పటికే ముహూర్తం ఖరారు చేశారు.. ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. 10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.. దీనిపై రేపు జరిగే కేబినెట్ సమావేశంలో క్లారిటీ ఇవ్వనున్నారు..
Read Also: Irfan Pathan: హుక్కా తాగే వాళ్లకే జట్టులో చోటు.. ఎంఎస్ ధోనీపై ఇర్ఫాన్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు!
“పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్‌ని అసెంబ్లీకి సిద్ధమా అంటూ సీఎం చంద్రబాబు ఛాలెంజ్ చేశారు.. ప్రతిపక్ష హోదా కావాలంటూ కొంతమంది మాట్లాడుతున్నారు.. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలకి విజ్ఞప్తి.. సభకి రండి.. ప్రజా సమస్యలపై చర్చించండి.. స్పీకర్ గా ఎమ్మెల్యేలు అందరికీ సమాన అవకాశం కల్పిస్తా..” అంటూ ట్వీట్ చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు..
పులివెందుల ఎమ్మెల్యే @ysjagan గారిని అసెంబ్లీకి సిద్ధమా అంటూ @ncbn గారు ఛాలెంజ్ చేశారు..
ప్రతిపక్ష హోదా కావాలంటూ కొంతమంది మాట్లాడుతున్నారు..
11 మంది వైసీపీ ఎమ్మెల్యేలకి విజ్ఞప్తి..
సభకి రండి..ప్రజా సమస్యలపై చర్చించండి..
స్పీకర్ గా ఎమ్మెల్యేలు అందరికీ సమాన అవకాశం కల్పిస్తా.. pic.twitter.com/6X5eOwo3DZ
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) September 2, 2025