ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో రకరకాల ట్విస్ట్‌లు పెరుగుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సీరియస్‌గా ముందుకు పోతోంది. లోతుల్లోకి వెళ్ళేకొద్దీ... తీగలు ఎక్కడెక్కడికో కనెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే... బీజేపీ స్వరం పెంచడం హాట్ టాపిక్ అయింది. దీంతో... ఆ పార్టీ ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. మా ఫోన్ కాల్స్‌ని కూడా వినేశారు.
రియల్టర్ గంగాధర్ (37) హత్య కేసులో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భర్త వేధింపులు తాల లేక భార్య మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి భర్తను హత్య చేసిందని పోలీసులు విచారణలో వెల్లడైంది.. మొదట ఫైనాన్స్ వ్యవహారం హత్యకు కారణమని భావించిన పోలీసులకు దిమ్మతిరిగే విషయాలు బయటపడుతున్నాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాద దృశ్యాలు.. ఇంకా కళ్లముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా మృతదేహాల అప్పగింత కూడా పూర్తికాలేదు. ఈలోపే మళ్లీ మళ్లీ విమానాల్లో లోపాలు బయటపడుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు.. గాల్లో దీపాలుగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అన్న భయం.. విమానం ఎక్కే వారిలో కనిపిస్తోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది ? లోపాలు ఎక్కడ ఉన్నాయి ? విమానాల్లో సాంకేతిక సమస్యాలా లేక నిర్వహణలో రూల్స్ పాటించకపోవడమా ?
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశమైన లోకేష్.. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేస్తున్నామని తెలిపారు.. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాప్రమాణాల మెరుగుదలకు చేపడుతున్న సంస్కరణలను కేంద్రమంత్రికి వివరించారు.
ఒక్క విషయం గుర్తుంచుకొండి.. కొందరు పోలీసు అధికారులకు చెబుతున్నాను.. చంద్రబాబు ఎల్లకాలం ఉండడు.. ఇప్పటికే ఏడాది గడిచింది.. నాలుగేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది... అప్పుడు మీకు సినిమా చూపిస్తాను.. మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కడికి సినిమా చూస్తా అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హల్ చల్ చేశారు.. ఏపీలో సంచలంగా మారిన లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కోర్టులో హాజరుపర్చే ముందు.. విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు పోలీసులు.. ఈ సందర్భంగా నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ విషయం సిట్ అధికారులకు కూడా తెలుసు.. ఇది మంచి పద్దతి కాదు.. నాకు నోటీసు కూడా ఇవ్వలేదు..
మా పార్టీలో ‘కమ్మ’ కులస్తులపై ఎందుకీ కక్ష..?.. కమ్మవారు మా పార్టీలో ఉండకూడదా? అని సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలను నిలదీశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. పల్నాడు జిల్లా పర్యటనలో రెంటపాళ్ళలో పర్యటించిన ఆయన.. ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.. వైసీపీ నేత నాగమల్లేశ్వరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏం పాపం చేశారని మా పార్టీలోని కాపు నేతలను ఇబ్బంది పెడుతున్నారు..? అని మండిపడ్డారు.. ఏం పాపం చేశారని వల్లభనేని వంశీని…
పల్నాడు జిల్లా పర్యటనలో రెంటపాళ్ళ వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్న.. ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.. పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం పక్కకుపోయి.. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. అందుకు నిదర్శనం నాగమల్లేశ్వరావు ఘటనే అన్నారు.