Minister Narayana: అమరావతి చాలా సేఫ్ సిటీ… ఇందులో అనుమానం లేదన్నారు మంత్రి పొంగూరు నారాయణ.. ఇవాళ ఉదయం రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన.. అమరావతి – నేలపాడులోని గెజిటెడ్ అధికారుల భవనాలు పరిశీలించారు.. క్లాస్- 4 ఉద్యోగుల క్వార్టర్లు నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. అమరావతి నిర్మాణంలో ప్రస్తుతం 13 వేల మంది పని చేస్తున్నారని తెలిపారు.. అధికారుల కోసం ఆరు టవర్ల నిర్మాణం జరుగుతోంది.. 720 ప్లాట్లు గ్రూప్ 1 అధికారుల కోసం రెడీ అవుతున్నాయి. నవంబర్ చివరి వరకు నిర్మణాలు పూర్తి అయ్యే అవకాశం ఉందన్నారు..
Read Also: Storyboard: కారులో కల్లోలం.. బీఆర్ఎస్ రాజకీయంగా ఉక్కిరిబిక్కిరవుతోందా..?
ఇక, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇప్పటికే ఉంది.. వచ్చే నెల 2 గ్రూప్ డీలో ఉన్న నిర్మణాలు పూర్తి అవుతాయి అన్నారు మంత్రి నారాయణ.. అన్ని నిర్మాణాలు పూర్తి అయిన తర్వాతే అధికారులకు భవనాలు అందచేస్తామన్నారు.. మరోవైపు, రాజధానిపై పని గట్టుకుని అబద్ధాలు చెబుతున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు.. అమరావతి గ్రాఫిక్స్ అంటే ప్రజలు క్షమించరు అని హెచ్చరించారు.. అమరావతి చాలా సేఫ్ సిటీ.. ఇందులో అనుమానం లేదని స్పష్టం చేశారు మంత్రి పొంగూరు నారాయణ. కాగా, కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతిలో నిర్మాణలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన విషయం విదితమే.. సీఆర్డీఏలో నిర్ణయం తీసుకోవడం.. ఆ తర్వాత కేబినెట్ ఆమోదం తెలపడం.. వెంటనే.. అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా చేపడుతూ ముందుకు సాగుతున్నారు.. అయితే, వర్షాలు, వరదల సమయంలో.. అమరావతిలో కొన్ని నిర్మాణాలు మునిగిపోయాయంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పించిన విషయం విదితమే.. అయితే, నిర్మాణాల కోసం తీసిన గోతుల్లో వర్షపు నీరు చేరినా మునిగిపోయేనట్టేనా అని కౌంటర్ ఇచ్చారు కూటమి నేతలు..