Gannavaram Airport: విజయవాడ – బెంగళూరు విమానానికి పెను ప్రమాదం తప్పింది.. గన్నవరం విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లేందుకు విమానం టేక్ ఆఫ్ అవుతోన్న సమయంలో పక్షిని ఢీకొట్టింది విమానం.. దీంతో, విమానం రెక్కలు దెబ్బతిన్నాయి.. ఊహించని ఘటనతో షాక్ తిన్న పైలట్.. వెంటనే విమానాన్ని తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లోనే ల్యాండ్ చేశారు.. దీంతో, ప్రయాణికులు, సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు.. ఈ ఘటన సమయంలో విమానంలో 100 మంది ప్రయాణికులు ఉండగా.. అందరిని విమానం నుంచి దించివేశారు సిబ్బంది.. గంట సమయం తర్వాత మరమ్మతులు పూర్తి చేసి.. తిరిగి విమానం బయల్దేరింది.. కాగా, విమానాలను పకులు ఢీకొన్న ఘటనలు చాలా ఉన్నా.. కొన్నిసార్లు ఇవి పెద్ద ప్రమాదానికి దారితీసిన సందర్భాలు లేకపోలేదు.. అయితే, విజయవాడ-బెంగళూరు విమానానికి పెను ప్రమాదం తప్పడంతో.. విమాన సిబ్బందితో పాటు.. ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు..
Read Also: Protest: మాకు చలానా వేస్తారు కదా..? ఇప్పుడు నాకు ఫైన్ కట్టండి..