AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్..!
- నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం..
- 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో భేటీ..
- పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet: నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది.. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.. సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. ఎస్ఐపీబీ నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.. పలు సంస్థలకు భూ కేటాయింపులు, అసెంబ్లీ సమావేశాలపై చర్చించే అవకాశం ఉంది.. కాగా, ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం..
Read Also: GST Council: చౌకగా మారనున్న చికిత్స.. ఈ మందులపై నో జీఎస్టీ..
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
ఇక, ఈ కేబినెట్ సమావేశం నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతోంది.. రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పర్యటనలు కొనసాగగా.. ఇప్పుడు రూ.53,922 కోట్ల మేర పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.. ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.. రాజధానిలోని పలు ప్రాజెక్టులకు ఎస్పీవీకి అమోదం తెలపనుంది కేబినెట్.. అర్బన్ డిజైన్లు, ఆర్కిటెక్చరల్ గైడ్ లైన్స్ నోటిఫికేషన్ కు ఆమోద ముద్ర వేయబోతోంది.. కన్వెన్షన్ సెంటర్లకు భూ కేటాయింపులకు అమోదం తెలపబోతోంది మంత్రివర్గ సమావేశం.. రాజధాని ల్యాండ్ పూలింగ్ కు ఇవ్వని వాటిపై భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు సీఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది కేబినెట్.. ఏరో స్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకో సిస్టంకు కూడా అనుమతి ఇవ్వబోతోంది ఏపీ కేబినెట్..
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!