AP Liquor Scam Case: సంచలనం సృష్టిస్తోన్న ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు చూపిస్తోంది.. లిక్కర్ కేసులో మరిన్ని కీలకమైన ఆధారాలు సేకరించింది సిట్.. చెవిరెడ్డి, విజయనందా రెడ్డి కంపెనీల సోదాల్లో లావాదేవీలకు సంబంధించిన మరింత కీలకమైన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి.. నిన్న తిరుపతి, హైదరాబాద్, చిత్తూరులో సోదాలు నిర్వహించిన విషయం విదితమే కాగా.. హైదరాబాద్ లో ఇషా ఇన్ఫ్రా కంపెనీ ఏర్పాటు.. కంపెనీలో సజ్జల భార్గవ్, మోహిత్ రెడ్డి, ప్రద్యుమ్న భాగస్వాముగా ఉన్నట్టుగా గుర్తించింది.. తిరుపతిలో పలు కంపెనీల పేర్లతో చెవిరెడ్డి లావాదేవీలు నిర్వహించినట్టుగా సిట్ అధికారులు చెబుతున్నారు.. మోహిత్ రెడ్డి 600 కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు సిట్ గుర్తించింది.. చిత్తూరులో విజయానందరెడ్డి కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించి.. మోహిత్ రెడ్డితో ఆయన భాగస్వామ్యంపై ఆధారాలు గుర్తించింది సిట్.. ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్ దొరికినా ఆధారాలతో కలిపి మిగిలిన సమాచారం ఇవ్వాలని సిట్ నిర్ణయం తీసుకుంది.. తుమ్మల గుంటలో చెవిరెడ్డి ఇంటి తాళం వేసి ఉండటంతో రాత్రి వరకు చూసి వెనుతిరిగారు సిట్ అధికారులు.
Read Also: Wobble Maximus: అతిపెద్ద స్మార్ట్ టీవీ.. 116.5-అంగుళాల డిస్‌ప్లేతో.. థియేటర్ లాంటి ఎక్స్‌పీరియన్స్
మరోవైపు, లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి సిట్ అధికారులు మరో ఛార్జ్ షీటును వేయాలని నిర్ణయించారు.. ఇప్పటికే ఈ కేసు కు సంబంధించి రెండు ఛార్జిషీట్లను అధికారులు ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. జూన్ 19న ప్రైమరీఛార్జ్ ఆగస్టు 10వ తేదీన రెండవ అదనపు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ రెండు ఛార్జిషీట్లలో అధికారులు ఇప్పటికే అరెస్టు చేసిన నిందితులు రాజ్ కేసు రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య పాత్ర గురించి వివరించారు.. కొన్నిసార్లు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు. అయితే జగన్ పేరు ఇప్పటివరకు నిందితుడిగా సిట్ అధికారులు పేర్కొనలేదు.. ఈ రెండు ఛార్జిషీట్ల మీద ఏసీబీ కోర్టు 20కి పైగా అభ్యంతరాలను కూడా లేవనెత్తింది.. ఈ అభ్యంతరాలు అన్నింటి మీద నివృత్తి చేస్తూ సీల్డ్ కవర్‌లో వివరణను కూడా సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు అందజేశారు..
ఇక ప్రస్తుతం కేసు విచారణ తుది దశకు చేరుకుంది.. సెప్టెంబర్ నెలాఖరు నాటికి కేసు విచారణ ముగించే దిశగా అధికారులకు విచారణ చేపట్టారు.. అందులో భాగంగానే కేసులో నిందితులుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఇళ్లల్లో కూడా పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు.. దీంతోపాటు నిందితుల ఆస్తులను కూడా భారీగా అటాచ్ చేయటానికి ప్రభుత్వం అనుమతి రావడంతో కోర్టు అనుమతి కోసం సిద్ధమవుతున్నారు. అయితే, కేసులో ఇప్పటికే అరెస్టై రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్లందరూ అరెస్టే 90 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో వారికి బెయిల్ రాకుండా ఉండాలంటే కచ్చితంగా సిట్ అధికారులు చార్జిషీట్లు దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సెప్టెంబర్ 15వ తేదీన మూడవ అదనపు ఛార్జిషీట్‌ను ఈ కేసులో దాఖలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఈ కేసులో 12 మంది అరెస్ట్ అవ్వగా మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మూడవ అదనపు చార్జిషీట్ దాఖలు చేసే అంశం కీలకంగా మారింది.