ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.. అయితే, ఇదే సమయంలో.. పోలవరాన్ని భారీ టూరిజం ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర 15 ఎకరాల్లో రిసార్ట్ ఏర్పాటుపై దృష్టి సారించారు అధికారులు.. 255 కోట్ల రూపాయలతో రిసార్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది..
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో బయటపడ్డ రాగి రేకుల్లో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి.. రాగి రేకుల్లో హాలీ తోకచుక్కకు సంబంధించిన శిలాశాసనం గుర్తించారు.. 1456లో విజయనగరరాజు మల్లికార్జున పాలనకు చెందిన సంస్కృత, దేవనాగరి లిపిలో ఈ శాసనం ఉందని అధికారులు తేల్చారు
టీటీడీపై మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చేసిన ఆరోపణలను కొట్టిపారేసింది టీటీడీ.. అవన్నీ అవాస్తవాలు, అభూత కల్పనలే అని స్పష్టం చేసింది.. నిర్ధిష్టమైన ఆధారాలు లేకుండా సంస్థ మీద బురద జల్లడం శోచనీయం. శ్రీవారి ఆలయంలో తరతరాలుగా వస్తున్న వేద పారాయణానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతోందని, వేద పారాయణదారులతో అవహేళనగా మాట్లాడటం అన్నది పూర్తిగా అవాస్తవం. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో వేద పారాయణాన్ని పఠించే సమయాన్ని గతం కన్నా మరింత పెంచడమే కాకుండా ప్రస్తుతం పూర్తిస్థాయిలో స్థిరీకరించడం కూడా జరిగిందని తెలిపింది టీటీడీ.
గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. మాట్లాడుతూ.. మన మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ మూసేసినా.. నేను మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను అని హెచ్చరించారు.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో టీడీపీ నాయకులపై ఎన్నో కేసులు బనాయించారు. కానీ, మనం మాత్రం.. కుళ్లు, కుతంత్రాల రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు..
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం కేంద్రంగా మారనుంది.. ఇప్పటికే యోగా దినోత్సవానికి సర్వం సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో.. వైజాగ్ ఎయిర్ పోర్ట్‌లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. విశాఖ ఎయిర్ పోర్ట్‌కు రానున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. ఇప్పటికే అరెస్ట్ అయిన కాకాణిపై పలు కేసులు నమోదు అవుతున్నాయి.. అయితే, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. కృష్ణపట్నం పోర్ట్ సమీపంలో అనధికార టోల్ గేట్ ఏర్పాటు చేసి.. వసూళ్లకి పాల్పడిన కేసులో జులై 3వ తేదీ వరకు కాకాణి గోవర్ధన్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది రైల్వే కోర్టు..
చిత్తూరులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చిత్తూరు రూరల్ చెర్లోపల్లిలో జరిగిన ఘటనపై పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 12వ తేదీన ఇంట్లో మంచంపై విగతజీవిగా పడి ఉన్న సరోజ అనే మహిళది సహజ మరణంగా భావించారు. జూన్ 13వ తేదీన అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే, సరోజ కొడుకు కన్నన్ కు ఒక బాలుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆరా తీస్తే, పక్కింటిలో ఉన్న స్నేహితురాలు నదియానే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు నిర్వహించనుంది.. దీని కోసం జిల్లాకు 2 లక్షల రూపాయల చొప్పున రూ.52 లక్షలు రెవెన్యూ డేకు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.. రెవెన్యూ డే సందర్భంగా ప్రతీ రెవెన్యూ జిల్లా కార్యాలయంలో వేడుకలు నిర్వహించనున్నారు.. రెవెన్యూ ఉద్యోగుల బాధ్యతలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జరగనున్నాయి
బనకచర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తెలంగాణతో నేను ఎప్పుడైనా గొడవపడ్డానా? అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ వాళ్లతో పోరాటం ఎందుకు? కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులన్నీ కట్టుకోండి.. మిగిలిన నీటినే మేం వాడుకుంటాం అన్నారు.. ప్రాజెక్టుల విషయంలో తెలంగాణతో పోరాటం చేయను అని స్పష్టం చేశారు.. బనకచర్ల ప్రాజెక్టుపై పోరాటాలు అవసరం లేదు.. ఎవరి నీరు వారిది.. అవసరమైతే ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకుందాం.. సముద్రంలోకి పోయే నీటిని ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో వాడుకుందాం అన్నారు చంద్రబాబు..