లఖింపూర్ ఖేరి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది… ఈ వ్యహారంపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది… ఈ ఘటనకు సంబంధించి ఇప్పటిదాకా ఎంత మందిని అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు సీజేఐ ఎన్వీ రమణ.. అయితే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నల నేపథ్యంలో యూపీ ప్రభుత్వంలో కదలిక మొదలైంది.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు పోలీసులు.. కాగా, గత సోమవారం ఆశిష్ మిశ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. అప్పటి నుంచి అతడి కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈ ఘటనలో మొత్తం 13 మందిపై కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు..
అయితే, ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా, లఖింపూర్ ఖేరి ఘటనలో నిందితులపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్, అరెస్టులపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి స్టేటస్ నివేదికను కోరింది సుప్రీంకోర్టు ధర్మాసనం.. బాధ్యులుగా గుర్తిస్తూ ఎవరెవరిపై కేసులు నమోదు చేశారో తెలపాలని, వివరాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.. ఇక, ఎవరినీ కాపాడే ప్రయత్నం చేయడం లేదు.. ఈ రోజు కేసు నమోదైన వారిలో ఇద్దరిని పోలీసులు ప్రశ్నించారని కోర్టుకు తెలిపారు లక్నో జోన్ ఐజీ లక్ష్మి సింగ్.. కాగా, నలుగురు రైతుల మృతి ఘటన అనంతరం జరిగిన హింసలో ఒక జర్నలిస్ట్, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక డ్రైవర్ మృతి.. మొత్తం నలుగురు మృతిచెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.. అధికార బీజేపీపై ప్రతిపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు.. ఈ పరిణామం బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టింది.