ఈసీకి బీజేపీ ఫిర్యాదు.. కలెక్టర్, సీపీని బదిలీ చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్‌లో పొలిటికల్ హీట్ ఓవైపు కొనసాగుతుండగా.. మరోవైపు ఫిర్యాదుల పర్వం కూడా కొనసాగుతోంది.. ఇప్పటికే ఈ వ్యవహారంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి బీజేపీ ఫిర్యాదు చేసింది… కరీంనగర్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారులను బదిలీ చేయాలని.. ఎన్నికలు పారదర్శకంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి కోరింది.. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఇంటెలిజెన్స్ వాళ్లు ఉంటున్నారు, ఫోటోలు కూడా తీసుకుంటున్నారు, దళిత బంధు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేసి ఫ్రీజ్ చేశారు.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పోలింగ్ రోజు విడుదల చేసేందుకు చూస్తున్నారు అంటూ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఇక, టీఆర్ఎస్ మీటింగ్ లో పోలీసులు భోజనాలు వడ్డిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ.. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వీరిని వెంటనే బదిలీ చేయాలని కోరింది. ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నికలు వస్తాయనే ఉద్దేశ్యంతోనే ఆ అధికారులను తీసుకొచ్చారని ఆరోపించిన బీజేపీ.. రిటర్నింగ్ అధికారి హరీష్‌రావుకి దగ్గర వ్యక్తి అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read
- Tags
తాజావార్తలు
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
-
Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
-
TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!