రూ.18 వేల కోట్ల ఓపెన్ బిడ్‌తో ఎయిరిండియాను సొంతం చేసుకుంది టాటా సన్స్.. దీంతో 68 ఏళ్ల తర్వాత తిరిగి ఎయిరిండియా.. టాటాల చేతిలోకి వెళ్లినట్టు అయ్యింది.. డిసెంబర్ నుంచి టాటాల చేతిలోకి వెళ్లిపోనుంది ఎయిరిండియా.. అయితే, టాటాల చేతికి సంస్థ వెళ్లిపోతుండడంతో.. అసలు ఎయిరిండియాలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి ఏంటి? అనే ఆందోళన ఉద్యోగుల్లో మొదలైంది.. దీనిపై క్లారిటీ కూడా ఇచ్చారు.. ఏఐలో పని చేస్తున్న ఉద్యోగులను ఏడాది పాటు అలాగే కొనసాగించనుంది టాటా గ్రూప్.. అంటే, ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను అధికారికంగా టేకోవర్ చేసిన తర్వాత రెండో ఏడాదిలో.. ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ద్వారా తొలగించేందుకు అనుమతిచ్చారు.
కాగా, ప్రస్తుతం ఎయిరిండియాలో 12 వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు.. ఎయిరిండియాలో 12,085 మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో 8.084 మంది పర్మినెంట్, 4,001 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్నారు.. మరోవైపు, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలో 1,434 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.. ఇక, ఎయిరిండియాను టాటా టేకోవర్ చేసుకున్నా.. ఐదేళ్ల పాటు ఎయిరిండియా బ్రాండ్, లోగో యథావిథిగా కొనసాగించనున్నారు.