తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్థానలో ఓ వైపు అరాచక పాలన కొనసాగుతుంటూ.. మరోవైపు.. దాడులు, ఆత్మహుతి దాడులు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.. ఇవాళ మరోసారి ఆఫ్ఘనిస్థాన్ రక్తసిక్తమైంది.. కుందుజ్‌లో మసీదుపై ఆత్మహుతి దాడి కలకలం రేపింది.. ఈ ఘటనలో మొత్తంగా 100 మంది మృతిచెందారు.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మాహుతి దాడి జరిగిన సమయంలో.. మసీదులో వందలాది మంది ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. నివేదికల ప్రకారం ఆత్మాహుతి దాడి ఘటనలో 100 మంది మరణించగా.. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు.
మా ప్రాథమిక పరిశోధనలో ఇది ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నామని కుందుజ్‌లో సంస్కృతి మరియు సమాచార డైరెక్టర్ మతియుల్లా రోహాని ప్రకటించారు.. ఆగష్టు చివరల్లో యూఎస్ మరియు నాటో దళాలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి వెళ్లిపోయిన తర్వాత తాలిబాన్లు దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.. అప్పటి నుంచి డజన్ల కొద్దీ మరణాల సంభవిస్తూనే ఉన్నా.. ఇవాళ జరిగిన మారణహోమమే అతిపెద్దదిగా చెబుతున్నారు. మసీదు లోపల శిథిలాల కింద మృతదేహాలు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఇక, మృతదేహాలు, బాధితుల ఆర్థనాధాలతో కుందుజ్ ప్రావిన్షియల్ హాస్పిటల్‌కు భయంకర పరిస్థితులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.