తూర్పు గోదావరి జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. కోవిడ్ సెకండ్ వేవ్‌లో భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూసిన ఈ జిల్లాల్లో తగ్గినట్టే తగ్గి.. పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. దీంతో.. కొన్ని ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. మరికొన్ని ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.. కోవిడ్ కేసులు కారణంగా రాజమండ్రి ఆదర్శనగర్‌లో రెండు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు అధికారులు.. కోవిడ్ కేసుల కట్టడికి కఠిన నిబంధనలు అమలు చేయాలని […]
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో రజత పతకం దక్కింది.. కుస్తీ వీరుడు రవికుమార్ సిల్వర్ మెడల్ గెలిచాడు.. పురుషుల 57 కిలోల విభాగంలో ఫైనల్లో రష్యా రెజ్లర్ చేతిలో ఓటమి పాలయ్యాడు రవికుమార్.. దీంతో.. ఆయన పసిడి పతకంపై పెట్టుకున్న ఆశలు ఆవిరికాగా… రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. రష్యా రెజ్లర్‌తో పోరాడి 4-7తో ఓడిపోయాడు రవికుమార్ దహియా.. ఫైనల్ ఓడినా ఆయనకు రజతం దక్కగా.. ఒలింపిక్స్ చరిత్రలోనే సిల్వర్ గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా చరిత్ర సృష్టించాడు […]
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్‌కు మంజూరు చేసిన ప్రత్యేక హోదా లేదా స్వయంప్రతిపత్తిని భారత ప్రభుత్వం రద్దు చేసింది. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినా.. స్థానిక పార్టీలు పూర్తిస్థాయిలో వ్యతిరేకించినా.. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసింది ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. దీనిపై దేశవ్యాప్తంగా కొన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించగా.. మరికొందరు వ్యతిరేకించారు.. ఇక, కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా.. గట్టిగా ఈ […]
హైదరాబాద్‌లోని జలసౌధాలో ఈ నెల 9వ తేదీన గోదావరి నది యాజమాన్య బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు రెండు బోర్డుల అధికారులు.. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఇరు రాష్ట్రాల ఇరిగేషన్‌శాఖ అధికారులకు లేఖ రాశారారు.. ఈ అత్యవసర సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాల అమలు కార్యాచరణపై చర్చించనున్నట్టు రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది.. అయితే, ఆ వెంటనే గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు […]
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చినట్టుగానే దత్తత గ్రామం వాసాలమర్రికి దళిత బంధు నిధులు విడుదల చేశారు.. బుధవారం వాసాలమర్రిలో పర్యటించిన ఆయన.. కాలినడకన తిరుగుతూ దళితవాడను పరిశీలించారు.. అక్కడున్న పరిస్థితులను చూసి చలించిపోయారు.. అనంతరం నిర్వహించిన సమావేశంలో.. వాసాలమర్రిలో మొత్తం 76 దళిత కుటుంబాలను గుర్తించామని… ఆ అన్ని కుటుంబాలకు దళిత బంధు పథకం కింద రూ.10 లక్షల చొప్పున రేపే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.. ఆయన చెప్పినట్టుగానే 76 దళిత కుటుంబాలకు రూ. […]
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో.. గోదావరి నది యాజమాన్య బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డులకు విస్తృత అధికారులు కల్పిస్తూ.. వాటి పరిధిలను నిర్ణయిస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్రం.. అయితే, దీనిపై భిన్నమైన వాదనలే ఉన్నాయి.. ఇక, రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు పరిష్కారం కాకపోవడం.. ఫిర్యాదుల పర్వం కొనాగుతూనే ఉన్నందున.. ఈ నెల 9న జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి.. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఇరు […]
కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టించింది.. క్రమంగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. మరికొన్ని ప్రాంతాల్లో పెరిగినా.. ఎక్కువ రాష్ట్రాలు పాజివిటీ రేటు పడిపోయింది.. దీంతో.. ఆంక్షలు ఎత్తివేస్తూ.. సడలింపులు ఇస్తూ వస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు.. బీహార్‌లో కూడా ఈ నెల 7వ తేదీ నుంచి షాపులు, స్కూళ్లు తెరుచుకోనున్నాయి. పాజిటివ్ కేసులు తగ్గిన నేపథ్యంలో ఆంక్షలను మరింతగా సడలించిన బీహార్ ప్రభుత్వం.. ఆగస్టు 7 నుంచి 25 వరకు సెలవు రోజుల్లో తప్ప.. మిగతా రోజుల్లో అన్ని […]
వృద్ధాప్య పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. వయోపరిమితిని తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న 65 ఏళ్ల వయోపరిమితిని 57 ఏళ్లకు కుదించింది సర్కార్.. వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయస్సును 65 ఏండ్ల నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో 36, తేదీ: 04-08-2021 ను విడుదల చేసింది.. ఇకపై అర్హులైన 57 ఏళ్ల వారందరికీ కొత్త పెన్షన్లు అందనున్నాయి. వెంటనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను […]
కృష్ణానది జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి… ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.. ఈ నేపథ్యంలో.. కృష్ణానది యాజమాన్యబోర్డు (కేఆర్ఎంబీ) రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించాల్సి ఉంది.. అయితే.. ఆ పర్యటన వాయిదా పటినట్టు ప్రకటించింది కేఆర్ఎంబీ.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల నేపథ్యంలో పర్యటన వాయిదా పడిందని అధికారులు వెల్లడించారు. మళ్లీ ఎప్పుడు పరిశీలన చేసేది తర్వాత వెల్లడిస్తామని కేఆర్ఎంబీ తెలిపింది. కాగా, ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకున్నా.. రాయలసీమ […]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. కృష్ణ నది జలాలతో పాటు.. గోదావరి జలాల విషయంలోనూ కొన్ని వివాదాలు ఉండగా… ఈ వివాదాలకు తెరదించాలన్న ఉద్దేశంతో… రెండు బోర్డుల అధికారాలు, పరిధిలను నిర్ణయిస్తూ.. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.. అయితే, దీనిపై భిన్నమైన వాదనలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. ఈనెల 9వ తేదీన గోదావరి నది యాజమాన్య బోర్డు పూర్తిస్థాయి అత్యవసర సమావేశం జరగనుంది… కేంద్ర జనశక్తి మంత్రిత్వ […]