దాదాపు 18 నెలల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో… బడులు ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. ఏడాదిన్నర తర్వాత… విద్యార్థులకు ప్రత్యక్ష బోధన జరగనుంది. పాఠశాలల్లో పూర్తి స్థాయిలో శానిటైజేషన్, క్లీనింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల యాజమాన్యాలు… తరగతి గదులను శుభ్రం చేస్తున్నాయి. క్లాసు రూమ్‌లతో పాటు బెంచ్‌లు, కుర్చీలను… శానిటైజ్ చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే… ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల […]
సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్.. డ్రగ్స్‌కు సంబంధించిన ఎక్సైజ్ శాఖ కేసులో నిందితులైన కెల్విన్ పీటర్ కమింగ్ ఇచ్చిన స్టేట్ మెంట్ పై సినీ ప్రముఖులకు నోటీసులు వెళ్లాయి.. 10 రోజుల క్రితం పూరి జగన్నాథ్ తో పాటు 11 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది ఈడీ.. నేటి నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు సినీ ప్రముఖులను ఈడీ […]
బెంగళూరులో అతివేగం ఏడుగురి ప్రాణాలను బలితీసుకుంది.. వేగంగా దూసుకెళ్లిన ఆడి కారు.. కరెంట్ పోల్‌ను ఢీకొట్టింది.. దీంతో.. అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడు.. హోసూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే వై. ప్రకాష్ కుమారుడు మృతిచెందాడని పోలీసులు తెలిపారు. ఇక, మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.. తెల్లవారుజామన 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. […]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ శివారులోని జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.. దీంతో.. ఏ క్షణమైనా గేట్లు ఎత్తేవేసే అవకాశం ఉందని చెబుతున్నారు అధికారులు.. హిమాయత్ సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటిమట్టం 1763.05 అడుగులకు చేరింది.. ఇక, ఇన్‌ఫ్లో కూడా భారీగానే ఉండడంతో.. గేట్లు ఎత్తివేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు.. ఇవాళ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మొదట ఒక్కో గేటు ఫీటు వరకు ఎత్తి […]
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ సైతం జారీ చేసింది.. ఇక, భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. ఇక, నిన్న మానేరు వాగుపై ఉన్న లెవెల్ వంతెనపై ఆర్టీసీ బస్సు చిక్కుకు పోగా.. ఇవాళ ఉదయం ప్రవాహ ఉధృతి ఎక్కువవడంతో వంతెనపై చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. వాగులో కొట్టుకుపోయింది.. వాగు పొంగి పొర్లుతుండడంతో బస్సును బయటకు తీసేందుకు […]
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కేసులు పూర్తిగా అదుపులోకి రాకముందే.. మళ్లీ రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. దీంతో కొత్త ప్రమాదం పొంచిఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. దేశంలో మరో కొత్తరకం కరోనా వైరస్ సెప్టెంబర్ నెలలో వెలుగు చూస్తే.. అక్టోబర్-నవంబర్ మధ్య కాలంలో గరిష్ఠానికి చేరుకోవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. సెకండ్ వేవ్‌తో పోలిస్తే దాని తీవ్రత అతి స్వల్పంగానే ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. దేశంలో కరోనా మూడో ముప్పు అనివార్యమని […]
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది.. వైరస్ రోజురోజుకు … రూపాంతరం చెందుతూనే ఉంది. ఇప్పటికే డెల్టా, అల్ఫా వంటి కొత్త వేరియంట్లతో… ఆయా దేశాల్లో విజృంభిగిస్తూనే ఉంది. ఇదే సమయంలో వైరస్ సంక్రమణ ఎక్కువగా ఉన్నట్లు భావిస్తోన్న మరో కొత్తరకం వెలుగులోకి వచ్చింది. కోవిడ్ కొత్త వేరియంట్ సీ.1.2ను… ఈ ఏడాది మే నెలలో తొలిసారి గుర్తించినట్లు దక్షిణాఫ్రికాకు చెందిన NICD, KRISPలు సంయుక్తంగా ప్రకటించాయి. ఆగస్టు 13 నాటికి చైనా, కాంగో, మారిషస్, […]
తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్‌ను ఖాళీచేసింది అమెరికా.. తాలిబన్లు పెట్టిన డెడ్‌లైన్‌కు ముందే తన బలగాలను పూర్తిగా తరలించింది.. కాబూల్ ఎయిర్పోర్ట్ నుంచి అమెరికా చిట్టచివరి విమానం సీ 17 యూఎస్ వెళ్లిపోయింది.. ఆఫ్ఘన్ నుంచి వెనుదిరిగిన చివరి అమెరికా సైనికుడు మేజర్ జనరల్ రాయబారి క్రిస్ గా పెంటగాన్ ప్రకటించింది. దీంతో.. 20 ఏళ్ల తర్వాత ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాలు పూర్తిగా వెనుదిరిగినట్టు అయ్యింది.. ఇక, యూఎస్ బలగాల తరలింపు పూర్తికావడంతో తాలిబన్లు సంబరాలు చేసుకుంటున్నారు. […]
టాలీవుడ్లో డ్రగ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈడీ ఎంట్రీతో టాలీవుడ్లో మరోసారి స్క్రీన్ షేక్ అవుతోంది. డ్రగ్స్ కేసులో నేటి నుంచి ఈడీ విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే ముగ్గురు నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ.. ఆ సమాచారంతో 12 మంది టాలీవుడ్ నటీనటులకు నోటీసులు జారీ చేసింది. ఇక, ఇవాళ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఈడీ ముందు హాజరు కానున్నారు. సెప్టెంబర్ 2న నటి చార్మీ, సెప్టెంబర్ 6న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ […]
మేషం : ఈ రాశివారికి ఈ రోజు దైవ కార్యక్రమాలపట్ల ఆసక్తి అధికమవుతుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు తప్పవు. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. దేనిమీదా శ్రద్ధ వహించలేరు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉండటం వల్ల పొదుపు సాధ్యంకాదు. వృషభం : ఈ రోజు ఈ రాశివారిపై శకునాల ప్రభావం అధికంగా ఉంటుంది.. మీపై బంధువుల వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం అధికంగా ఉంటుంది. ఉద్యోగ, విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. ప్రముఖ సంస్థల […]