టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేవారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి.. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో జరిగిన సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంగ్లీష్‌లో బోధనలపై చంద్రబాబు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.. ఆయన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయన్న ఆయన.. చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ఏ మీడియంలో చదివాడో చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇప్పుడు లోకేష్ కుమారుడు ఏ మీడియంలో చదువుతున్నాడు అని ప్రశ్నించిన మిథున్‌రెడ్డి.. చంద్రబాబు పిల్లలు మాత్రం […]
టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే ఏడు పతకాలను తన ఖాతాలో వేసుకుంది భారత్.. ఇక, షూటింగ్లో స్వర్ణం సాధించి సత్తా చాటింది భారత మహిళా షూటర్ అవని లేఖరా.. దీంతో.. ఆమెకు బంపరాఫర్ ఇచ్చారు ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన.. పలు అంశాలపై స్పందిస్తూ ఉంటారు.. ఇక, కొన్ని సార్లు గిఫ్ట్‌లు ఇస్తూ సర్ప్రైజ్ చేస్తుంటారు.. ఇప్పుడు […]
మరోసారి హస్తినబాట పట్టనున్నారు తెలంగాణ సీఎం, గులాబీ పార్టీ బాస్ కేసీఆర్.. ఈ సారి మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగనుంది.. కేసీఆర్ పర్యటనకు ఈసారి చాలా ప్రత్యేకత ఉంది.. ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించి.. జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని ఎప్పటి నుంచో భావిస్తున్న గులాబీ పార్టీ అధినేత.. హస్తినలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమిపూజ చేయనున్నారు.. ఇక, ఈ మూడు రోజుల పర్యటనలో రెండు రోజుల పాటు ఢిల్లీలోనే బస చేయనున్నారు. […]
ఉత్తరప్రదేశ్ రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ బహుజన సమాజ్‌వాది పార్టీ (బీఎస్పీ) ప్రముఖ పాత్రి పోషించింది.. ఇప్పటికీ కీలకంగా పనిచేస్తోంది.. అయితే, బీఎస్పీ అధినేత్రి త్వరలోనే అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటారనే చర్చ సాగుతోంది.. దీంతో మాయావతియే క్లారిటీ ఇచ్చారు.. బీఎస్పీకి కాబోయే చీఫ్ సతీష్ చంద్ర మిశ్రాయేనా అని మీడియా ప్రశ్నించగా.. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే బీఎస్పీ అధ్యక్షులు అవుతారని.. పార్టీకి, తనకు అన్ని సమయాల్లో అండగా ఉంటూ పార్టీని నడిపించే సమర్థులకే […]
కరోనా హమ్మారిపై విజయం సాధించడానికి రకరకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. కొన్ని దేశాలు స్వయంగా వ్యాక్సిన్లు తయారు చేస్తే.. మరికొన్ని దేశాలు వాటిని దిగుమతి చేసుకుని తమ ప్రజలకు అందిస్తున్నాయి.. అయితే, అక్కడక్కడ వ్యాక్సిన్లు వికటించిన మృతిచెందినట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి.. తాజాగా, న్యూజిలాండ్‌లో ఓ మహిళ మృతిచెందారు.. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ మహిళ చనిపోయినట్లు న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అత్యంత అరుదైన మయోకార్డిటిస్ అంటే గుండె […]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఏపీపై తెలంగాణ… తెలంగాణపై ఏపీ.. ఇలా ఫిర్యాదుల పర్వానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడంలేదు.. తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు మెంబర్ సెక్రటరీకి లేఖ రాశారు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణరెడ్డి.. సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ఇండెంట్ లేకుండా తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని నిలువరించాలంటూ కేఆర్ఎంబీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం , నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్నందున కేఆర్ఎంబీ అనుమతితో […]
సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.. ఇప్పటికే ముగ్గురు నిందితుల స్టేట్మెంట్ రికార్డు చేసిన ఈడీ అధికారులు.. ఆ ముగ్గురు ఇచ్చిన సమాచారంతో 12 మంది టాలీవుడ్ నటీనటులకు నోటీసులు కూడా జారీ చేశారు.. ఇక, రేపటి నుంచి ఈ కేసులో ఈడీ విచారణ ప్రారంభం కానుంది… వరుసగా టాలీవుడ్ నటీనటులను విచారించనుంది ఈడీ.. ఆ తర్వాత మరికొందరుపై దృష్టిసారించే అవకాశం ఉందని చెబుతున్నారు.. అయితే, ఇప్పటికే ఈ కేసులో ఎక్సైజ్ శాఖ […]
టీఆర్ఎస్, ఎంఐఎం రెండూ ఒక్కటే నంటూ మరోసారి ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఆయన చేపట్టిన పాదయాత్ర మూడు రోజుకు చేరుకుంది.. ఇక, రాత్రి బసచేసిన బాపుఘాట్ దగ్గర ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజ నుంచి మంచి స్పందన ఉందన్నారు.. మొన్న ప్రారంభమైన పాదయాత్ర నిన్న రాత్రి 2 గంటల వరకు కొనసాగిందన్న ఆయన.. యువతీ, యువకులు, మహిళలు, పెద్దవాళ్ళు పాదయాత్రకు బాగా మద్దతిస్తున్నారు.. మంగళ హారతులు […]
కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ ఆరోగ్యపరిస్థితి కాస్త ఇబ్బందిగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఇవాళ అత్యవసర వైద్య చికిత్సల కోసం చెన్నై నుంచి దుబాయ్ వెళ్లారు విజయ్‌కాంత్.. కుమారుడుతో కలసి చికిత్స కోసం చెన్నై ఎయిర్‌పోర్టు నుండి దుబాయ్ ప్రయాణం అయ్యారని చెబుతున్నారు.. ఇక, ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి అక్కడ నుండి అమెరికాకు కూడా తీసుకెళ్తారని సమాచారం.. కాగా, గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు విజయ్‌కాంత్.. గత ఏడాది […]
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీసుకున్న తాజా నిర్ణయం వివాదాస్పదంగా మారింది.. ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని 177 కల్యాణ మండపాల నిర్వహణను హిందూ సంస్థలు, ఆలయాలు, మఠాలు, ట్రస్ట్‌లు, హిందూ మతానికి చెందిన వ్యక్తులకు 5 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చేందుకు సిద్ధమైంది.. 5 సంవత్సరాల కాలపరిమితితో లీజుకు ఇచ్చేందుకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది టీటీడీ.. అయితే, ఓ వైపు నూతన కల్యాణ మండపాలను నిర్మిస్తూ… మరో వైపు నిర్మించిన కల్యాణ […]