భారత్‌లో కరోనా కేసులు కిందకు పైకి కదులుతూనే ఉన్నాయి.. తాజా బులెటిన్ ప్రకారం కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,65,286 శాంపిల్స్ పరీక్షించగా… 12,516 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. మరో 267 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. ఇదే సమయంలో 13,155 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3.44కు చేరగా.. ఇప్పటి వరకు 3.38 కోట్ల మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది.. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 267 రోజుల కనిష్టానికి చేరింది. ప్రస్తుతం దేశ్యాప్తంగా 1,37,416 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. యాక్టివ్ కేసులు 0.40 శాతానికి పడిపోగా.. రికవరీ రేటు 98.26 శాతానికి పెరిగింది. ఇక, మృతుల సంఖ్య 4,62,690కి చేరింది.