ఉత్తర ప్రదేశ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. ఈ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతోంది. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా ఇవాళ వారణాసి వెళ్తనున్నారు. ఆయన తూర్పు యూపీలోనే రెండు రోజులపాటు పర్యటించనున్నారు. బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో అమిత్ షా పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా పాల్గొనే అవాకశముంది. బీజేపీ సోషల్ మీడియా వాలంటీర్లు, బూత్ ప్రెసిడెంట్లతో కూడా మరొక సమావేశం నిర్వహిస్తారు. తూర్పు ఉత్తర ప్రదేశ్‌లోని ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై అభిప్రాయాలను సేకరిస్తారు. అనంతరం అజంగఢ్‌లో ఓ యూనివర్సిటీకి అమిత్ షా శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు అమిత్‌షా.