ఆఫ్ఘనిస్థాన్‌ను మొత్తం తమ ఆధీనంలోకి తీసుకోవడానికి తాలిబన్లకు ముచ్చెమటలు పడుతున్నాయి… దేశ రాజధాని కాబూల్‌ను సైతం వాళ్లు స్వాధీనం చేసుకున్నారు.. అమెరికా సైన్యం సైతం కాబూల్‌ను ఖాళీచేయడంతో సంబరాలు చేసుకున్నారు.. అయితే, తాలిబన్లకు పంజ్‌షీర్ లో మాత్రం తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.. పంజ్‌షీర్…అంటే ఐదు సింహాలు అని అర్థం. పేరుకు తగ్గట్టే… పంజ్‌షీర్ ప్రజలు పోరాడుతున్నారు. తమ ప్రాంతంలోకి తాలిబన్లను అడుగు పెట్టనివ్వకుండా… పోరాటం చేస్తున్నారు. అన్ని ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు… ఈ ప్రాంతాన్ని […]
వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు విజయమ్మ. రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఈ సమావేశానికి వైఎస్ఆర్తో పని చేసిన వారికి, సన్నిహితులకు ఆహ్వానాలు పంపారు.. ఇక, వైఎస్ఆర్ సన్నిహితుడి, ఆత్మగా పేరున్న మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుకు కూడా ఆహ్వానం వెళ్లింది.. గాంధీ భవన్లో వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆత్మీయ సమ్మేళనానికి నాకు ఆహ్వానం అందింది.. నేను […]
సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు సినీనటి ఛార్మి..డ్రగ్ పెడలర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఛార్మికి ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే కాగా.. ఆ నోటీసుల్లో పేర్కొన్న తేదీ ప్రకారం.. ఇవాళ హైదరాబాద్‌లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు ఛార్మి.. తనతో పాటు చార్టెడ్ అకౌంటెంట్లను కూడా వెంట తెచ్చుకున్నారు.. ఇక, బ్యాంకు డీటెయిల్స్ అన్ని వెంట తీసుకొచ్చారు. అయితే, ఈడీ కార్యాలయానికి ఛార్మి చేరుకున్న సమయంలో.. అక్కడ హంగామా […]
దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయ చేరుకున్న ఆయన.. వైఎస్ సమాధి దగ్గర నివాళులర్పించారు.. ఆ తర్వాత ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు… ఈ కార్యక్రమానికి వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ భారతి, వారి కుటుంబసభ్యులు, పలువురు ఏపీ మంత్రులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.. ఇక, వైఎస్ రాజశేఖర్ […]
భారత్‌లో తగ్గినట్టే తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి.. రోజువారి కేసుల సంఖ్య ఇప్పుడు 50 వేల వైపు పరుగులు తీస్తోంది.. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 47,092 కొత్త కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూవాయి.. మరో 509 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు.. ఇదే సమయంలో 35,181 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో ఇప్పటి […]
ఢిల్లీలో కుండపోత వర్షం కురుస్తోంది… గత మూడు రోజులుగా హస్తినను వీడడం లేదు వర్షాలు.. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 112 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. గత 12 ఏళ్లలో ఎన్నడూ ఇంత వర్షం పడలేదు. 2010 సెప్టెంబర్ 20న ఢిల్లీలో 110 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఆ రికార్డును ఇప్పుడు బ్రేక్ చేసింది. ఢిల్లీలో నిన్నటి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ -NCR పరిధిలోని గురుగ్రామ్, మనేసర్, ఫరిదాబాద్, […]
దివంగత సీఎం, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా.. తన తండ్రిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా వేదికన ఓ పోస్టు చేశారు వైఎస్ జగన్.. “నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను […]
వస్తు సేవల పన్ను రికార్డు స్థాయిలో వసూలు అవుతోంది. జులై 2021లో రూ.1,16,393 కోట్లు రాగా.. ఆగస్టు మాసానికి రూ.1,12,020 కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఆగస్టులో వచ్చిన మొత్తం జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.20,522 కోట్లుగా ఉంది. స్టేట్ జీఎస్టీ రూ.26,605 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.56,247 కోట్లుగా ఉన్నాయి. వీటితో పాటు సెస్సుల రూపంలో మరో రూ.8646 కోట్లు చొప్పున వసూలైనట్టు కేంద్రం వెల్లడించింది. జులై నెలతో పోలిస్తే […]
నేటి నుంచి ఓవల్ వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ మధ్య నాల్గో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.. లీడ్స్‌లో ఎదురైన దారుణ ఓటమి నుంచి తేరుకుని.. ఓవల్‌లో సత్తా చాటాలనే పట్టుదలతో ఉంది టీమిండియా. అయితే, మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో భారత్ ఇబ్బంది పడుతోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె సహా ఛతేశ్వర్ పుజారా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు. లార్డ్స్‌లో 61 పరుగులు చేసి ఆకట్టుకున్న రహానె మూడో టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. […]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఇవాళ సినీ నటి ఛార్మి.. ఈడీ విచారణకు హాజరుకానున్నారు. డ్రగ్ పెడలర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఛార్మికి ఈడీ నోటీసులు ఇచ్చింది. మనీలాండరింగ్ కోణంలో ఛార్మి బ్యాంక్ అకౌంట్స్ ను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. కెల్విన్ అకౌంట్ లోకి ఛార్మి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిందా? ఛార్మి ప్రొడక్షన్ హౌజ్ ఆర్థిక లావాదేవీలపై అరా తీయనుంది. కెల్విన్ కు భారీగా నగదు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఈడీ వద్ద కీలక ఆధారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎంత […]