సూర్యాపేట జిల్లాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. సూర్యాపేట మండలం రాజు నాయక్ తండా ఓ మహిళలను అందరూ చూస్తుండగా కళ్లలో కారం కొట్టి, వివస్త్రను చేసి వీధుల్లో తిప్పుతూ దాడి చేశారు కొందరు వ్యక్తులు.. అయితే, ఇవాళ ఆ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.. మహిళను వివస్త్రను చేసి కళ్లలో కారం కొట్టి వీధుల్లో తిప్పుతూ దాడి చేసిన తండావాసులను అరెస్ట్ చేసేందుకు ఆ గ్రామానికి వెళ్లారు సూర్యాపేట రూరల్ పోలీసులు.. అయితే, తాము ఎలాంటి తప్పు చేయలేదని […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. ఏపీ రాజధానిగా విశాఖను పేర్కొంటూ కేంద్రం ఓ ప్రకటన చేసింది. జులై 26న లోక్సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం.. ఏపీ రాజధాని వైజాగ్ అని అర్థం వచ్చేలా ప్రకటన చేసింది. అయితే, దీనిపై మళ్లీ క్లారిటీ ఇచ్చింది కేంద్రం… వైజాగ్ ఏపీ రాజధాని అని చెప్పటం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది.. విశాఖ ఒక నగరం మాత్రమేనని తాజాగా పేర్కొంది.. […]
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మూడో రోజుకు చేరుకుంది.. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి పాదయాత్రను ప్రారంభించిన ఆయన.. రెండో రోజు గోల్కొండ కోట దగ్గర బహిరంగసభ నిర్వహించారు.. 2023 ఎన్నికల్లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.. ఇక, ఇవాళ సంజయ్ పాదయాత్ర మూడో రోజుకు చేరుకోగా.. తిప్పుఖాన్ బ్రిడ్జి, లంగర్ హౌస్, ఆరే మైసమ్మ దర్శనం తర్వాత సభ నిర్వహించి లంచ్ […]
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. తుర్లపాడు మండలం రోలుగుంపాడులోని ఎస్టీ కాలనీ వద్ద టాటా ఏస్ వాహనం బోల్తా పడిన ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందారు.. రోడ్డుపై చనిపోయిన గేదెపైకి దూసుకెళ్లిన టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది.. స్పాట్లోనే ఐదుగురు మృతిచెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయినట్టుగా చెబుతున్నారు.. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.. క్షతగాత్రులను చికిత్స కోసం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి […]
బీహార్ రాజకీయాలతో పాటు.. జాతీయ రాజకీయాల్లోనూ నితీష్ కుమార్ కీలక భూమిక పోషించారు.. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన ఆయన.. రెండు దఫాలుగా బీహార్ సీఎంగా కొనసాగుతున్నారు.. అయితే, ప్రధానికి కావాల్సిన అర్హతలన్నీ నితీష్ కుమార్కు ఉన్నాయంటూ.. జేడీయూ పార్లమెంటరీ పార్టీ నేత ఉపేంద్ర కుశ్వాహా వ్యాఖ్యానించడం కొత్త చర్చకు దారితీసింది.. దీంతో.. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జేడీయూ నేత నితీష్ కుమార్ కూడా ప్రధాని రేసులో ఉన్నారా? అనే చర్చ మొదలైంది.. ఈ […]
కరోనా కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో ఎక్కువగా ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి ఎక్కువగా వినిపించిన మాట.. కోవిడ్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని.. ఇక, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ను తెలంగాణలో అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ రాగా.. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తోన్న ప్రభుత్వం.. ఇప్పుడు కోవిడ్ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్ భారత్ పేరిట ఈ పథకం అమలు చేయనున్నారు.. తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద […]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.. అయితే, అదే ఒరవడి కొనసాగింపుగా టి.పీపీసీ ప్రయత్నాలు చేస్తోంది.. ఇక, హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మణికం ఠాగూర్.. ఇవాళ గాంధీ భవన్లో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు… ఈ సమావేశంలో ముఖ్యంగా గజ్వేల్ సభ, హుజురాబాద్ ఉప ఎన్నికపై చర్చించనున్నట్టుగా తెలుస్తోంది.. ఇక, ఇప్పటికే పలు పేర్లను హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బరిలో దింపేందుకు పరిశీలించిన పీసీసీ.. ఫైనల్గా మాజీ […]
మేషం: ఈ రోజు మీరు విందులు, వినోదాలకు దూరంగం ఉండటం చాలా మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలున్నాయి.. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. వృషభం: ఈ రోజు ఈ రాశివారు చేసే అన్ని ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలిసే సూచనలున్నాయి. మిథునం: ఈ రోజు మీకు ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది.. ఆకస్మిక […]
గత ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తే.. సార్వత్రిక ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.. ఎప్పుడైనా విశాఖ కేంద్రం పరిపాలన ప్రారంభం కావొచ్చు అని ఏపీ మంత్రులు, ఎంపీలు ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు.. అయితే, వైజాగ్ రాజధాని దిశగా కేంద్రం నుంచి ఆసక్తికరమైన సంకేతం వచ్చింది.. పార్లమెంట్ విడుదల చేసిన డాక్యుమెంట్లో ఏపీ రాజధాని వైజాగ్గా గుర్తించింది […]
తమిళనాడులో మాతృత్వానికి మచ్చ తెచ్చిన ఓ ఘటన కలకలం రేపుతోంది.. కన్న బిడ్డను రకరకాలుగా కొట్టి చిత్రహింసలకు గురిచేసింది ఓ తల్లి.. దీంతో రెండేళ్ల ప్రదీప్ అనే బాలుడి పరిస్థితి విషమంగా మారింది.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు.. విల్లిపురం జిల్లాలోని సత్యమంగళం మెట్టూరు గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెట్టూరు గ్రామానికి చెందిన వడివేలన్.. ఏపీలోని చిత్తూరు జిల్లా రాంపల్లికి చెందిన తులసిని పెళ్లి చేసుకున్నాడు.. వీరికి […]