నవంబర్ 12, శుక్రవారం దినఫలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు అకాల భోజనం వల్ల ఆరోగ్యంలో చికాకులు తలెత్తుతాయి. ఉపాధ్యాయులకు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయాలలో వారికి స్నేహ బృందాలు అధికమవుతాయి. గృహంలో ఏదైనా వస్తువు పోయే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.
వృషభం : ఈ రోజు మీకు ఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి, హడావిడి అధికంగా ఉంటాయి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయొద్దు. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రత్యర్థులు మిత్రులుగామారి దైవకార్యాల్లో పాల్గొంటారు. ఏదైనా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి.
Also Read
మిథునం : ఈ రోజు ఈ రాశివారు ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. దైవ, పుణ్య, సేవా కార్యాల పట్ల మరింతగా ఆసక్తి పెంచుకుంటారు. ప్రేమికులకు మధ్య వేదాంత ధోరణి కానవస్తుంది. మీ శ్రీమతి ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. పరిచయాల వల్ల మీ జీవితం ఊహించని మలుపు తిరుగబోతోంది. వాహనంకొనాలనే ఆలోచన క్రియా రూపంలో పెట్టిన జయం చేకూరుతుంది. ఇతరులకు సలహా ఇవ్వటం వల్ల మాటపడవలసి వస్తుంది.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని కేటరింగ్, హోటల్ తినుబండ వ్యాపారులకు శుభదాయకంగా ఉండగలదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి జయం పొందండి. రాబోయే సమస్యలను తేలికగా గ్రహించడం వల్ల రాజకీయాల్లో వారు కుదుటపడతారు. నిరుద్యోగులకు ఎటువంటి అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోవటం మంచిది.
కన్య : ఈ రోజు ఈ రాశివారికి వాతావరణంలో మార్పు చికాకు కలిగించగలదు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువుల రాకతో మీలో ఉల్లాసం, ఉత్సాహం అధికమవుతుంది. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
తుల : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మిత్రులను కలుసుకుంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పుల వల్ల మాటవపడతారు. విందులు, వినోదాల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశివారు వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. మీ కళత్ర మొండి వైఖరి వల్లకుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. ఆత్మీయుల అతిథి మర్యాదలు సంతృప్తిని ఇస్తాయి. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారి సంతానం అతిగా వ్యవహరించటం వల్ల మాటపడక తప్పదు. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత ముఖ్యం. రాజకీయ, కళా రంగాలకు చెందిన వారు లక్ష్యాలు సాధిస్తారు.
మకరం : ఈ రోజు ఈ రాశిలోని వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో విభేదాలు తలెత్తుతాయి. స్త్రీలుదైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరిని ఆకట్టుకుంటారు. స్త్రీలు షాపింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళుకువ వహించండి. హోటల్, తినుబండారాలు, కేటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి.
కుంభం : ఈ రోజు ఈ రాశివారు సాహిత్య సదస్సులలోను, బృంద కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. కొబ్బరి, పండు,పూలు, చల్లని పానియ వ్యాపారులకు కలిసివచ్చే కాలం.
మీనం : ఈ రోజు ఈ రాశివారు తీర్థయాత్రలు, విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలు విలువైన బంగారు వస్తువులపై దృష్టి సారిస్తారు. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు దొర్లుట వల్ల పైఅధికారులతో మాటపడక తప్పడు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!