పురిటినొప్పులతో సైకిల్‌పై ఆస్పత్రికి మహిళా ఎంపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమె ఓ ఎంపీ.. పైగా గర్భవతి.. అర్ధరాత్రి ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి.. దీంతో.. వెనుకా ముందు ఆలోచించకుండా వెంటనే ఇంట్లో ఉన్న సైకిల్ ఎక్కి ఆస్పత్రికి వెళ్లింది.. ఆ తర్వాత పురిటినొప్పులు తీవ్రమయ్యాయి.. వెంటనే ఆమెకు డెలివరీ చేశారు వైద్యులు.. పండంటి బిడ్డకు ఆ మహిళా ఎంపీ జన్మనిచ్చింది.. ఇది ఏ సినిమా స్టోరీయో కాదు.. న్యూజిలాండ్‌లో జరిగిన యదార్థ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. న్యూజిలాండ్ ఎంపీ జూలీ అన్నే జెంటర్ నిండు గర్భవతి.. ఆమెకు ఇవాళ తెల్లవారుజామున 2 గంటల సమయంలో పురిటినొప్పులు ప్రారంభం అయ్యాయట.. వెంటనే ఆమె ఇంట్లో ఉన్న బైక్ వంటి సైకిల్‌పై ఆస్పత్రికి వెళ్లారు.. ఇక, ఆస్పత్రిలో చేరిన 10 నిమిషాలకే పురిటి నొప్పులు మరింత తీవ్రం కావడంతో.. వైద్యులు వెంటనే ఆమెను లేబర్ రూమ్‌కు తరలించి డెలివరీ చేశారు.. పండంటి బిడ్డకు జన్మనిచ్చారు ఎంపీ జూలీ అన్నే జెంటర్.. తర్వాత ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. వైరల్‌గా మారిపోయింది.
ఇక, ఘటనపై తన ఫేస్‌బుక్ పేజీలో పంచుకున్నారు ఎంపీ జూలీ అన్నే జెంటర్.. ఆమె సాధారణంగా బైక్‌కు బదులు పర్యావరణ పరిరక్షణ కోసం సైకిల్ వాడుతూ వస్తున్నారు.. బైక్‌లా కనిపించే సైకిల్‌ను వాడతారు.. కానీ, చివరకు ఆస్పత్రికి కూడా ఆమె సైకిల్‌పైనే వెళ్లారు. ఈ ఘటనపై ఆమె స్పందిస్తూ.. పురిటినొప్పులతో సైకిల్‌పై ఆస్పత్రికి వెళ్లాలని మాత్రం తాను ప్లాన్ చేయలేదని తెలిపారు.. అదంతా అకస్మాత్తుగా జరిగిపోయిందన్నారు.. అయితే, తాను సైకిల్‌పై ఆస్పత్రికి బయల్దేరిన అర్ధరాత్రి 2 గంటల సమయంలో పెద్దగా పురిటి నొప్పులు లేవని కానీ, ఆస్పత్రిలో చేరిన పది నిమిషాల తర్వాత నొప్పులు అధికమయ్యాయని.. మొత్తంగా ఆస్పత్రిలో చేరిన గంట తర్వాత, తను రెండో బిడ్డకు జన్మనిచ్చానని.. మా కుటుంబంలోని సరికొత్త సభ్యుడిని తెల్లవారుజామున 3:04 గంటలకు స్వాగతించామని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు.. మొత్తంగా మహిళా ఎంపీ.. నిండు గర్భిణిగా చేసిన ఈ సాహసానికి నెటిజన్లు ఫిదా అయిపోయి ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read
- Mojtaba Khamenei: హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతు.. "జిహాద్, ప్రతిఘటనే ఏకైక మార్గం".. మొజ్తబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు
- Israel: వెస్ట్ బ్యాంక్‌లో భారీ ఆపరేషన్‌కు సిద్ధం: నెతన్యాహు కీలక ప్రకటన
- Germany plane crash: ఇంటి పైకప్పుపై కూలిన విమానం.. ఇద్దరు మృతి
- Saudi-Yemen: పశ్చిమాసియాలో మరో యుద్ధం.. సౌదీపై యెమెన్ క్షిపణి దాడులు
- Tags
తాజావార్తలు
-
Public Examinations Act Amendment Bill 2026: లోక్‌సభలో యాంటీ- పేపర్ లీక్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం..
-
Cyber Fraud: సైబర్ మోసాల బారిన ప్రజలు.. రూ.2.10 కోట్లకు పైగా టోకరా.!
-
Anil Ravipudi: రాజమౌళి తర్వాత ఆ రేంజ్ క్రేజ్.. నిర్మాతల ఛాయిస్‌గా అనిల్ రావిపూడి!
-
Supreme Court: విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
SC Status: ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు క్లారిటీ.. రివ్యూ పిటిషన్‌కు నో చెప్పిన ధర్మాసనం.!
ట్రెండింగ్
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
-
iPhone 18 Pro, Pro Max ఫుల్ డీటెయిల్స్ లీక్.. లాంచ్ అప్పుడే.!