ఆఫ్ఘనిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు.. ఇక, మహిళలపై క్రమంగా ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు తాలిబన్లు.. తాజాగా అమ్మాయిలు, మహిళలు ఎలాంటి క్రీడలు ఆడకూదంటూ ఆంక్షలు విధించింది తాలిబన్ సర్కార్.. ఆఫ్ఘన్ మహిళలు క్రికెట్ సహా ఎలాంటి క్రీడల్లో పాల్గొనవద్దని స్పష్టం చేసింది.. వారు ఎలాంటి ఆటలు ఆడేందుకు అనుమతి లేదని పేర్కొంది. అమ్మాయిలకు క్రీడలు అవసరం లేదు.. క్రీడలతో బాడీ ఎక్స్పోజింగ్ అవుతుందని వ్యాఖ్యానించారు తాలిబన్ కల్చరల్ కమిషన్ డిప్యూటీ హెడ్ […]
రాయలసీమ ఎత్తిపోతల కేసులో మరోసారి విచారణ జరిపింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ).. ఇవాళ విచారణ సందర్భంగా.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎన్జీటీకి నివేదిక అందజేసింది.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన శాస్త్రవేత్త పసుపులేటి డా. సురేష్ బాబు.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు స్థలం వద్ద ఎలాంటి పనులు జరగడం లేదని.. ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకువచ్చిన సామగ్రి అంతా ఆ ప్రాంతంలో నిల్వ ఉంచారని ఎన్జీటీ […]
టీఆర్ఎస్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. బండి మీద కారు ప్రయాణిస్తోందంటూ కామెంట్ చేసిన ఆయన.. బీజేపీ, టీఆర్ఎస్ కు అవగాహన ఉందన్నారు.. తెలంగాణ విమోచన దినోత్సవం జరపటం ఇద్దరకీ ఇష్టం లేదని.. ఈ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ కు నార్కోటిక్ టెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు. ఇక, తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవానికి బీజేపీ మతం రంగు పులుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ.. విమోచన దినోత్సవం గురించి మాట్లాడే అర్హత కమ్యూనిస్టులకు మాత్రమే […]
హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో.. కాంగ్రెస్ పార్టీని వీడి.. అధికార టీఆర్ఎస్లో చేరారు పాడి కౌశిక్ రెడ్డి.. ఆ తర్వాత గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని శాసన మండలికి పంపనున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్.. దీనిపై నిర్ణయం తీసుకున్న తెలంగాణ కేబినెట్.. గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం ఆ ఫైల్‌ను రాజ్‌భవన్‌కు కూడా పంపించారు. అయితే, గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డి పేరును ఎమ్మెల్సీగా ప్రభుత్వం సిఫార్సు చేయడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ప్రభుత్వంపై […]
కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాలేదు.. ప్రపంచవ్యాప్తంగా థర్డ్ వేవ్ హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. ఇక, థర్డ్ వేవ్ ఎక్కువ చిన్నారులపైనే ప్రభావం చూపబోతుందంటూ పలు హెచ్చరికలు ఉన్నాయి.. అయితే, పెద్దవారి ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోన్న మహమ్మారి.. చిన్నారులపై ఊపిరితిత్తులను ఏ స్థాయిలో దెబ్బతీస్తుందనేదానిపై అధ్యయనం చేశారు శాస్త్రవేత్తలు.. కానీ, కోవిడ్ వల్ల చిన్నారులు, కౌమారప్రాయుల్లో ఉన్నవారి ఊపిరితిత్తులపై పెద్దగా ప్రభావం చూపదని.. కోవిడ్ బారినపడినా.. వారి అవయవాల పనితీరులో పెద్దగా మార్పులు రావని గుర్తించారు శాస్త్రవేత్తలు. […]
తెలంగాణలో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లడమే కాదు.. గ్రామాలు, పట్టణాల్లోని ముంపు ప్రాంతాల్లో జలమయం అయ్యాయి.. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.. ఇక, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి… ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి వరద నీరు.. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దుల్లోని కందకుర్తి బ్రిడ్జిపై […]
ఆంధ్రప్రదేశ్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై వివాదం నడుస్తూనే ఉంది.. ఈ విషయంలో ఏపీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు, హిందూ సంఘాలు.. వైఎస్ వర్ధంతికి, స్కూళ్లకు, బార్లకు లేని కరోనా.. వినాయక ఉత్సవాలు నిర్వహిస్తేనే వస్తుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.. ఇక, వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలంటూ విశాఖలో మౌనదీక్ష చేపట్టారు.. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశ్వ హిందూ సాదు పరిషత్ ఆధ్వర్యంలో మౌన దీక్షకు కూర్చుకున్నారు.. వినాయకుడి విగ్రహానికి నల్ల రిబ్బన్ కట్టి.. […]
భారతీయ జనతా పార్టీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసంపై దుండగులు బాంబులు విసరడంతో తీవ్ర కలకలం రేపింది.. పూర్తి వివారాల్లోకి వెళ్తే.. కోల్‌కతాలోని ఎంపీ అర్జున్ సింగ్ ఇంటి దగ్గర ఇవాళ ఉదయం బైక్‌పై వచ్చిన కొందరు దుండగులు బాంబులు విసిరారు.. మొత్తం మూడు బాంబులు ఇంట్లోకి విసిరే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుండగా.. అవి ఇంటి గేటు దగ్గర పేలాయి.. ఈ ఘటనలో ఇంటి గేటు ధ్వంసం అయ్యింది. ఇక, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో.. అంతా […]
ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి.. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను విడుదల చేశారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల కోసం 1,75,8687 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. టెస్ట్‌కు 1,66,460 మంది విద్యార్థులు హాజరయ్యారని.. వారిలో 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని వెల్లడించారు మంత్రి.. ఇక, విద్యార్థుల రెస్పాన్స్ షీట్ లను ఈ నెల […]
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, బీహార్ మాజీ సీఎం.. ప్రస్తుతం అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడుగా ఉన్న సదానంద్ సింగ్ కన్నుమూశారు… ఆయన బుధవారం ఉదయం మృతిచెందినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించారు.. ఇక, బీహార్‌లోని భాగల్పూర్ జిల్లాలోని కహల్గావ్ అసెంబ్లీ స్థానం నుంచి సదానంద్ సింగ్… తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. సదానంద్ సింగ్ 2000 నుండి 2005 వరకు బీహార్ శాసనసభ స్పీకర్‌గా కూడా ఉన్నారు. అంతకుముందు అతను బీహార్ నీటిపారుదల మరియు ఇంధన […]