తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో.. వాగులు వంకలు, ప్రాజెక్లులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి… ఎగువన కురిసిన వర్షాలకు సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో గేట్లు ఎత్తివేశారు అధికారులు… సింగూరు ప్రాజెక్ట్ నాలుగు గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేయడంతో.. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.. దీంతో.. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది… ఆలయంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. ఉత్సవ విగ్రహానికి గోపురం వద్ద పూజలు నిర్వహించారు.. ఆలయ ప్రాంగణంలో.. […]
సంచలనం సృష్టిస్తున్నా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. ఈ కేసులో ఇప్పటికే రంగంలోకి దిగిన ఈడీ.. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు.. ఒక్కొక్కరిని ప్రశ్నిస్తూ.. వారి బ్యాంకు లావాదేవీలపై ఆరా తీస్తూ వస్తున్నారు. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ వచ్చింది.. డ్రగ్స్ కేసుకు మూలంగా ఎఫ్ కేఫ్ లాంజ్ మారింది.. ఎఫ్ కేఫ్ లాంజ్ కేంద్రంగా సినీస్టార్స్ కు డ్రగ్స్ […]
తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది.. ఇప్పటికే 100 కిలోమీటర్ల మైలురాయిని దాటేసింది.. ఇక, సంజయ్ పాదయాత్రలో కేంద్రమంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ సీఎంలు.. ఇలా రోజుకో నేత పాల్గొంటున్నారు. ఇవాళ బీజేవైఎం నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వి సూర్య.. సంజయ్ పాదయాత్రలో కొద్దిసేపు తెలుగులోకి మాట్లాడారు తేజస్వి సూర్య.. బండి సంజయ్ చేసేది పాదయాత్ర కాదు కేసీఆర్ మీద చేసే దండ యాత్ర అన్న ఆయన.. తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్ […]
కార్వీ ఎండీ పార్థసారథిని… చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు సైబరాబాద్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ పోలీసులు. పీటీ వారంట్ వేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఈనెల 9 వరకు పార్థసారథిని కస్టడీకి అనుమతించింది కోర్టు. మరోవైపు ఇవాళ జైలులో ఈడీ విచారణ ముగిసింది. ఈడీ విచారణ ముగిసిన తర్వాతే పార్థసారథిని కస్టడీలోకి తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. కాగా, కార్వీ కన్సల్టెన్సీ అక్రమాలను పాల్పడినట్టు అభియోగాలున్నాయి.. రూ.780 కోట్లు ఖాతాదారుల నెత్తిన కుచ్చుటోపీ పెట్టినట్లు నిర్ధారించారు. రూ.720 కోట్ల […]
ఓ సీఎం తండ్రిపై కేసు నమోదు కావడమే సంచలనంగా మారగా.. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ చేయడం చర్చగా మారింది.. ఇక, ఆ అరెస్ట్‌ను సీఎం సమర్థించారు.. చట్టం ముందు సమానులేనని స్పష్టం చేశారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘెల్ తండ్రి నంద్‌కుమార్ బఘెల్‌ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. బ్రహ్మణులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ.. చత్తీస్‌గఢ్ పోలీసులు.. ఆయనను అరెస్ట్ చేశారు. బ్రహ్మణ సంఘం నేతల ఫిర్యాదుతో నంద్‌కుమార్ ను […]
కేంద్రం బాటలో ఏపీ ప్రభుత్వం అడుగులు వేయబోతుంది. ప్రభుత్వ ఆస్తుల మోనటైజేషన్ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మిషన్ బిల్డ్ ఏపీలో భాగంగా విజయవాడలోని స్టేట్ గెస్ట్ హౌస్ ప్రాంగణాన్ని కమర్షియల్ డెవలప్ మెంట్ కోసం అప్పగించింది ప్రభుత్వం. దీని కోసం మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తోంది. మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను రుద్రాభిషేక్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ కు అప్పగించింది. మొత్తం 3.26 ఎకరాల్లో విస్తరించిన స్టేట్ గెస్ట్ హౌస్ ను లక్ష చదరపు […]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాల విషయంలో వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. పరస్పరం ఫిర్యాదులు, లేఖల పర్వం కొనసాగగా.. గతంలో తెలంగాణ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.. ఇవాళ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది.. ఏపీ విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేకుండా తెలుగు గంగ, వెలిగొండ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచేందుకు విస్తరణ పనులు చేపట్టిందని ఇటీవల కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది తెలంగాణ ప్రభుత్వం.. అనుమతి లేకుండా […]
సంచలనంగా మారిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఉన్న కెల్విన్‌కు నాంప్లి కోర్టు సమన్లు జారీ చేసింది.. అయితే, ఈ సమన్లు బోయిన్పల్లి కేసులో జారీ అయ్యాయి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కెల్విన్‌ను 2016లో బోయిన్‌పల్లిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేవారు.. అతడి దగ్గర ఎల్ఎస్డీ రకం డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల వివరాలతో 2016 ఆగస్టులో కెల్విన్‌పై బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సీసీఎస్‌లోని నార్కోటిక్స్ విభాగానికి కేసు బదిలీ అవ్వడం.. […]
ఉభయ తెలుగు రాష్ట్రాల నేతలు హస్తిన బాట పట్టారు.. త్వరలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు.. ఈలోపే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ చేరుకున్నారు.. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానం మేరకు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు.. మొదట ప్రహ్లాద్ జోషితో సమావేశంకానున్న ఆయన.. ఆ తర్వాత తన పర్యటనలో పలువురు బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది. […]
టమోటా ధర రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది.. కిలో ధర ఏకంగా రూపాయికి పడిపోయింది.. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో దారుణంగా పడిపోయింది టమోటా ధర.. ఇవాళ కిలో టమోటా ఒక్క రూపాయికే అమ్ముడు పోయింది.. దీంతో రైతులు ఆందోళనకు దిగారు.. వారికి మద్దతుగా రైతు సంఘం ధర్నా చేపట్టింది.. టమోటా రైతులను ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ లో ధర్నా చేశారు అన్నదాతలు.. ప్రభుత్వమే టమోటాలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని […]