కరోనా మహమ్మారి తరిమివేయాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం.. దీంతో వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెట్టింది భారత్ ప్రభుత్వం.. అందులో భాగంగా దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఆ తర్వాత మరికొన్ని విదేశీ వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.. ఇక, ఆ తర్వాత మరికొన్ని దరఖాస్తులు కూడా వచ్చాయి. అందులో.. పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కంపెనీ తయారు చేస్తున్న కొవొవాక్స్ టీకా కూడా ఉంది.. అయితే, దీనికి నిపుణుల కమిటీ ఆమోదం తెలుపలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ.. సీరం సంస్థ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకుంది.. ఇటీవలే ఆ దరఖాస్తును పరిశీలించిన నిపుణుల కమిటీ.. అదనపు డేటా ఇవ్వాలని సీరం సంస్థకు స్పష్టం చేసింది.
Read Also: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
కాగా, సీరం సంస్థ ప్రస్తుతం దేశంలో నిర్వహించిన ఫేజ్-2, ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన తాత్కాలిక భద్రత, ఇమ్యునోజెనిసిటీ డేటాను, అలాగే అమెరికా, యూకేలో నిర్వహించిన ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి భద్రత, సమర్థత డేటాను కూడా డీసీజీఐకి అందజేసింది… అయితే, ఈ నెల 24న దరఖాస్తుపై చర్చించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO).. కోవిడ్-19 సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ.. వ్యాక్సిన్.. సాంకేతిక బదిలీ అని, దేశంలో ఇంకా ఆమోదించలేదని పేర్కొంది. మరోవైపు.. దేశంలో వ్యాక్సిన్ ఇంకా ఆమోదించనందున సీరం సంస్థ రెండు కోట్ల డోసుల కొవొవాక్స్ టీకాలను ఇండోనేషియాకు ఎగుమతి చేసేందుకు ఇటీవల అనుమతి పొందినట్టుగా తెలుస్తోంది.. ఈ ఏడాది మే 17న కొవొవాక్స్ టీకా తయారీ, నిల్వ చేసేందుకు సీరం కంపెనీకి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.