పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలిరోజే రచ్చతో మొదలయ్యాయి… ప్రతిపక్షాల ఆందోళనలతో సభ ప్రారంభమైన వెంటనే గంట పాటు వాయిదా వేశారు లోక్‌సభ స్పీకర్.. మరోవైపు రాజ్యసభలోనూ ఇలాంటి పరిస్థితే రిపీట్ అయ్యింది.. అయితే, దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చలు జరగాలని ఆకాక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రాజ్యాంగ దినోత్సవం స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని సూచించిన ఆయన.. ప్రతీ ప్రశ్నకు జవాబిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: ఆన్‌లైన్ ఆహార ప్రియులకు అలెర్ట్.. స్విగ్గీ డెలివరీ బాయ్స్ సమ్మె..!
దేశవ్యాప్తంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ నిర్వహిస్తున్నామని వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఇందులో భాగంగా దేశం నలుమూలలా అనేక కార్యక్రమాలు చేపడతామన్న ఆయన.. స్వాత్రంత్య్ర దినోత్సవ సమయంలో కన్న కలలను సాకారం చేసే దిశగా చర్యలు చేపడుతున్నాం అన్నారు. ప్రజలు తమ వంతు సాయం అందించేందుకు ముందుకొస్తున్నారని వెల్లడించిన ఆయన.. దేశ ఉజ్వల భవిష్యత్తుకు ఇది శుభ సంకేతమని హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఇవాళ పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం కాగానే.. విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలో ఆందోళనకు దిగారు.. వరి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలంటూ లోక్‌సభలో ప్లకార్డులను ప్రదర్శించారు టీఆర్ఎస్ ఎంపీలు.. దీంతో.. గందరగోళం నెలకొనడంతో.. సభను గంటపాటు వాయిదా వేశారు.