హైదరాబాదీ అలెర్ట్.. 3 రోజుల్లో విదేశాల నుంచి 2 వేలకు పైగా ప్రయాణికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కోవిడ్ కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది.. కరోనా వైరస్ తాజా రూపాంతరం అయిన ఒమిక్రాన్.. యావత్ ప్రపంచం వణికిపోయేలా చేస్తోంది.. ఈ వేరియంట్ వెలుగుచూసిన 4 రోజుల్లోనే ఏకంగా 14 దేశాలకు వ్యాప్తి చెందింది అంటే.. దాని స్పీడు, తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.. కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూస్తుండడంతో ఇప్పటికే రాష్ర్టాలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది భారత ప్రభుత్వం… మరోవైపు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో ఆయా రాష్ట్రాలు కూడా అప్రమత్తం అయ్యాయి.. అయితే, ఇప్పుడు రిస్క్‌లో ఉన్న దేశాల నుంచి హైదరాబాద్‌కు ఏకంగా 2 వేల మందికి పైగా ప్రయాణికులు హైదరాబాద్‌కు వచ్చారు. అది కూడా ఈ మూడు రోజుల వ్యవధిలోనే కావడం మరింత కలవరపెట్టే విషయం.
Read Also: ఆన్‌లైన్ ఆహార ప్రియులకు అలెర్ట్.. స్విగ్గీ డెలివరీ బాయ్స్ సమ్మె..!
Also Read
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
ఇక, కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగు చూసిన దేశాల నుంచి, ఆ రిస్క్ ఉన్న దేశాల నుంచి గత 3 రోజుల్లో హైదరాబాద్‌కు భారీ సంఖ్యలో ప్రయాణికులు వచ్చారు.. ఏ దేశం నుంచి ఎంత మంది హైదరాబాద్‌కు వచ్చారో గమనిస్తే.. యూకే నుంచి 1,717 మంది, సౌతాఫ్రికా నుంచి 185, బ్రెజిల్ నుంచి 10, బంగ్లాదేశ్ 9, బోట్స్‌వానా నుంచి 16, చైనా నుంచి 9, మారిషస్ నుంచి ఇద్దరు, న్యూజిలాండ్ నుంచి 108 మంది, జింబాబ్వే నుంచి 11 మంది, యూరోపియన్ దేశాల నుంచి 102 మంది.. ఇలా మొత్తం మూడు రోజుల్లోనే 2,168 మంది విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. అసలే, సాధారణ పరిస్థితులు వచ్చాయంటూ.. ఎవరూ కోవిడ్ రూల్స్ పాటించడంలేదు.. బహిరంగ ప్రదేశాల్లోనూ.. గుంపులుగా చేరిన దగ్గర కూడా మాస్క్‌లు కనిపించడంలేదు.. ఆ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఎవరు ఎక్కడ ఉన్నారో.. ఎక్కడెక్కడ తిరిగేస్తున్నారు.. ఎవరిలో ఏ వేరియంట్ ఉందో తెలియని పరిస్థితి.. సో హైదరాబాదీ బీ అలెర్ట్.. నీ రక్షణ.. కుటుంబ సంరక్షణ నీ చేతుల్లోనే ఉంది.
తాజావార్తలు
-
Telangana Cabinet: తెలంగాణలో కరువు టెన్షన్.. 235 మండలాల్లో వర్షభావం..
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?