ఆన్‌లైన్ ద్వారా క్యాబ్ బుకింగ్ సేవలను అందిస్తూ అందరికీ చేరువైన ‘ఓలా’ క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వచ్చింది.. ఇప్పటికే ఆటోలు, బైక్‌లు కూడా ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకునే అవకాశం కలిపించిన ఆ సంస్థ.. ఇప్పుడు కొత్త వ్యాపారం ప్రారంభించింది.. ‘ఓలా స్టోర్’ పేరుతో స్టోర్లను తెరించింది.. ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకుంటే.. నేరుగా కిరాణా సరుకులను డోర్ డెలివరీ చేయనుంది… ఈ సరికొత్త బిజినెస్‌లో భాగంగా మొదట ముంబై, బెంగళూరు అంతటా ఆన్‌లైన్ కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించింది ఓలా.. రోజుకు దాదాపు 10,000 ఆర్డర్లను స్వీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది ఆ సంస్థ.. ఇక, ముంబై, బెంగళూరు నుంచి రాబోయే రోజుల్లో ఇతర నగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది ఓలా..
ఆర్డన్ ఇచ్చిన కేవలం 10 నిమిషాల్లో కిరాణా సరుకులు డోర్ డెలివరీ చేయడం తన ప్రత్యేకగా చెబుతున్నారు నిర్వాహకులు.. ఓలా యాప్ ద్వారా క్విక్ డెలివరీ సేవలు పొందవచ్చునని.. దాదాపు రెండు వేల రకాల వస్తువులను మా స్టోర్ నుంచి ఆర్డర్ చేయవచ్చు అని ఓలా ప్రకటించింది.. ఇక, ఈ కొత్త బినిజెన్ కోసం ఓలా రూ.250 కోట్లు కేటాయించినట్లుగా తెలుస్తుంది. జనవరి నాటికి 300 ఓలా స్టోర్లు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. కాగా, క్రమంగా ఆన్‌లైన్ బిజినెస్‌కు క్రేజ్ పెరుగుతూ వస్తుంది.. నచ్చిన వస్తువు కోసం మార్కెట్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఇప్పుడు అంతా ఆన్‌లైన్‌లోనే షాపింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. కరోనా సమయంలో.. ఇది మరింత పెరిగిందని మార్కెట్ నిపుణులు చెబుతున్న మాట.