ఆయన 3 అడుగులు, ఆమె 2 అడుగులు.. కలిసి 7 అడుగులు వేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు.. ఎవరికి ఎవరితో ముడి పడేది ముందే నిశ్చయించబడుతుందని చెబుతారు.. ఇక, ఆ జంట చూడ ముచ్చటగా ఉంటే.. ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అని అభినందిస్తారు.. బెంగళూరులో తాజాగా పెళ్లి చేసుకున్న ఓ జంటను చూస్తే చూడ ముచ్చటగా ఉంది.. వరుడు విష్ణుకు 28 వచ్చినా.. వధువు జ్యోతికి 25 ఏళ్లు నిండినా.. వయస్సుకు తగ్గట్టు శరీరంలో పెరుగుదల లేదు.. ఇద్దరూ బెంగళూరులో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు.. అయితే, ఈ క్యూట్ కపుల్‌కు కర్ణాటకలో చింతామణి వద్దనున్న కైవార క్షేత్రంలో వివాహ వేడుక జరిగింది.
Read Also: కాల్ మనీ వేధింపులు.. వీఆర్వో ఆత్మహత్య
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ఈ వివాహాన్ని చూస్తే బాల్య వివాహం చేశారా? అనే అనుమానం కలిగేలా ఉంది.. వరుడు విష్ణు ముచ్చటగా మూడు అడుగుల ఎత్తు ఉంటే.. వధువు జ్యోతి 2 అడుగుల ఎత్తు ఉంది.. ఆ ఇద్దరు కలిసి ఏడు అడుగులు వేసి వివాహ బంధంతో ఒక్కటయ్యారు.. వేద మంత్రాల సాక్షిగా, బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం వైభవంగా జరిగింది. విష్ణుది బెంగళూరు అయితే.. జ్యోతిది కోలార్.. ఇద్దరూ బెంగళూరులో మంచి ఉద్యోగాలే చేస్తున్నారు.. మరగుజ్జులు కావడంతో పెద్దలు చేసిని పెళ్లి ప్రయత్నాలు చాలానే బెడిసి కొట్టాయి.. కానీ, వీరు కలిసి ఏడు అడుగులు వేయాల్సి ఉందేమో.. విష్ణు కుటుంబానికి జ్యోతి గురించి తెలిసింది… ఇంకేముందు.. అలా సంబంధం కలుపుకుని పెళ్లి చేశారు.. ఇప్పుడు ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.. ఈ క్యూట్ కపుల్‌కు శుభాకాంక్షలు తెలిపుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
తాజావార్తలు
-
Mythri Ravi: ‘తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
-
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
-
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!