ఆ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత కుదరదు.. స్పష్టం చేసిన వెంకయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టులో జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించినందుకు 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే… ఇక, ఆ 12 మంది ఎంపీలను శీతాకాల సమావేశాల్లో కూడా సస్పెండ్ చేస్తూ రాజ్యసభ సోమవారం తీర్మానాన్ని ఆమోదించడంతో.. ఒక్కసారిగా పొలిటిక్ హీట్ పెరిగింది… రాజ్యసభ సభ్యులు.. ఫూలో దేవి నేత, ఛాయా వర్మ, రిపున్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, అఖిలేశ్ ప్రసాద్ సింగ్, డోలా సేన్, శాంతా చెత్రి, ప్రియాంక చతుర్వేది, అనిల్ దేశాయ్, ఎలమారమ్ కరీమ్, బినయ్ విశ్వంను శీతాకాల సమావేశాలు మొత్తానికి సస్పెండ్ చేయాలంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానం ప్రవేశపెట్టడం.. మూజువాణి ఓటుతో ఆమోదించడం జరిగిపోయాయి..
అయితే, ఈ వ్యవహారంపై ఇవాళ రాజ్యసభలో చర్చ జరగగా.. ఆ 12 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు మల్లిఖార్జున్ ఖర్గే.. వర్షాకాల సమావేశాల్లో జరిగిన ఘటనపై ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకున్నారంటూ ఆయన నిలదీశారు.. ఇక, దీనిపై స్పందించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు.. వర్షాకాల సమావేశాల్లో ఎదురైన చేదు అనుభవాలు ఇంకా వెంటాడుతున్నాయని వ్యాఖ్యానించారు.. సభలో అనుచితంగా ప్రవర్తిస్తూ రభస సృష్టించిన ఎంపీలపై చర్యలు తీసుకునే హక్కు చైర్మన్‌కు ఉందన్న ఆయన.. సస్పెన్షన్ ఎత్తివేత అభ్యర్ధనను తిరస్కరిస్తున్నట్టు తెలిపారు.. సస్పెన్షన్ ఎత్తివేత కుదరని స్పష్టం చేశారు.
Also Read
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
- Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
- Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
తాజావార్తలు
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!