ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి ఇప్పుడు టెన్షన్ పెడుతోంది.. దీంతో అప్రమత్తమైన కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.. ఇక, ఈ కొత్త వేరియంట్‌పై రాజ్యసభలో క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ.. భారత్‌లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు.. ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభలో మాట్లాడిన ఆయన… ఒమిక్రాన్ వేరియంట్‌ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.. ఎయిర్‌పోర్ట్‌ల వద్ద స్క్రీనింగ్ చేస్తున్నామని, పాజిటివ్ కేసులకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.. ఒమిక్రాన్ వేరియంట్ గుర్తింపులో భాగంగా టెస్టింగ్‌ను పెంచాలని అన్ని రాష్ట్రాలను ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు గుర్తుచేశారు మన్సుఖ్ మాండవీయ.. కాగా, ఈ కొత్త వేరియంట్‌తో హై రిస్క్ ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే కాగా.. కొత్త వేరియంట్‌ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. ఆర్‌టీ పీసీఆర్, యాంటీజెన్ పరీక్షల్లోనూ ఒమిక్రాన్‌ను గుర్తించవచ్చు అని అధికారులు చెబుతున్నారు..