-
Sri Lanka Crisis: శ్రీలంక సర్కార్ కీలక నిర్ణయం..
శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో రెండు నెల క్రితం రోడ్లెక్కిన జనం.. ఆందోళనలు ఉధృతం చేశారు. నిరసనలు కాస్త హింసాత్మకంగా మారాయి. దీంతో ఎమర్జెన్సీ విధించిన శ్రీలంక ప్రభుత్వం.. తరువాత సడలించింది. మళ్లీ మే 6 నుంచి చేపట్టిన నిరనసలు విధ్వంసానికి దారి తీయడంతో.. రెండోసారి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆ తరువాత మహింద రాజపక్స రాజీనామా చేయడం, కొత్త ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. ఇదే సమయంలో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టడంతో… […] -
Nara Lokesh: కోర్టుకు హాజరైన నారా లోకేష్.. ఉద్రిక్తత..!
విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకి హాజరయ్యారు టీడీపీ నేత నారా లోకేష్.. 2020లో అచ్చెన్నాయుడు అరెస్ట్ సమయంలో అచ్చెన్నకు మద్దతుగా ఏసీబీ కోర్టు వద్దకు వచ్చారు లోకేష్.. అయితే, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేష్ పై కేసు నమోదైంది.. కేసు విచారణలో భాగంగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు.. ఆయనతో పాటు కోర్టుకు హాజరయ్యారు కొల్లు రవీంద్ర.. అయితే, లోకేష్ కోర్టుకు హాజరు సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.. రహదారులు దిగ్బంధించి టీడీపీ నేతల్ని అడ్డుకున్నారు […] -
Anthony Albanese: ఆస్ట్రేలియా ప్రధానిగా ప్రమాణం.. వెంటనే విదేశీ టూర్..
ఆస్ట్రేలియా ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. 2007 తర్వాత తొలిసారి ఎన్నికల్లో గెలుపొందడంతో… ఆ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 151 స్థానాలున్న సభకు సభ్యుల్ని ఎన్నుకునేందుకు శనివారం పోలింగ్ జరిగింది. కరోనా దృష్ట్యా 1.70 కోట్ల మంది ముందస్తు ఓటింగ్ లేదా పోస్టల్ విధానాన్ని ఎంచుకున్నారు. మిగతా ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ద్రవ్యోల్బణంలో దేశ వాసులకు ఉపశమనం కల్పించేందుకు ఆర్థిక సాయం, సామాజిక […] -
Ukraine Russia War: మరోసారి విరుచుకుపడ్డ రష్యా.. అవే టార్గెట్..
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు చేస్తోంది. డాన్బాస్ ప్రాంతంలోని మూడు కమాండ్ పాయింట్లతో పాటు సైనిక సామాగ్రి నిల్వ ఉన్న 13 స్థావరాలు, నాలుగు మందుగుండు డిపోలను ధ్వంసం చేసింది. దక్షిణ ఉక్రెయిన్‌లోని మైకోలైవ్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో మోహరించిన మొబైల్ యాంటీ-డ్రోన్ వ్యవస్థను రష్యా రాకెట్లు దెబ్బతీసినట్టు సమాచారం. ముఖ్యంగా ఉక్రెయిన్ సైనిక స్థావరాలే టార్గెట్‌గా రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయి. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టి దాదాపు నాలుగు నెలలు […] -
Lockdown: చైనాలో మళ్లీ కోవిడ్ విజృంభణ.. కీలక నగరాల్లో లాక్డౌన్..
కరోనా పుట్టినిల్లు డ్రాగన్ దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు భయపెడుతున్నాయి.. చైనా ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా… కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. రాజధాని బీజింగ్ మరోసారి కఠిన ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోయింది. చైనాలో కొత్తగా 157 కోవిడ్ కేసులు నమోదుకాగా.. వీటిలో 52 బీజింగ్‌లోనే వెలుగు చూశాయి. జీరో కోవిడ్ పాలసీకి అనుగుణంగా ఆదివారం నుంచి నగరంలో లాక్డౌన్ అమలు చేశారు. దీంతో మరిన్ని నగరాలు లాక్డౌన్ పరిధిలో వెళుతున్నాయి. హయిడియన్, చావోయాంగ్, ఫెంతాయ్, షన్‌యి, […] -
Bride case: సృజన కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
విశాఖ జిల్లా మధురవాడలో వధువు సృజన మృతి కేసు మిస్టరీ వీడింది. పెళ్లి ఆపాలనుకునే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకుంది సృజన. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చారు పోలీసులు. పరవాడకు చెందిన మోహన్‌తో ఏడేళ్లుగా సృజన ప్రేమ వ్యవహారం నడుస్తోంది. సరైన ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి సమయం కోరాడు మోహన్. అయితే, పెళ్లికి మూడు రోజుల ముందు ప్రియుడితో ఇన్‌స్టాలో చాటింగ్ చేసింది సృజన. పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి చెప్పింది. పెళ్లి ఆపేందుకే సృజన విపపదార్థం […] -
Chandrababu: హత్యకు గురైన ఎమ్మెల్సీ డ్రైవర్ ఫ్యామిలీకి టీడీపీ ఆర్థికసాయం..
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కలకలం సృష్టించింది.. అయితే, సుబ్రహ్మణ్యం కుటుంబానికి టీడీపీ ఆర్థిక సాయం ప్రకటించింది.. మృతుడు సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. మరోవైపు ఎమ్మెల్సీ అనంతబాబును ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. ఇక, నిందితుల అరెస్ట్ కోసం దళిత సంఘాలతో కలిసి తదుపరి కార్యాచరణకు సిద్ధం అవుతోంది టీడీపీ. మరోవైపు, దళిత […] -
CM Jagan: దావోస్‌లో ఏపీ సీఎం.. రెండోరోజు షెడ్యూల్ ఇదే..
దావోస్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ఆయన.. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా వరుసగా భేటీలు అవుతున్నారు.. ఇక, రెండో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు సీఎం జగన్.. ఫ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ అంశంపై ఇవాళ డబ్ల్యూఈఎఫ్ పబ్లిక్ సెషన్లో మాట్లాడనున్నారు.. స్విస్ కాలమానం ప్రకారం ఉదయం 8:15ల కు సెషన్ ప్రారంభం కానుంది.. Read […] -
Gold Price: పసిడి ధరలు ఈ రోజు ఇలా..
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ పసిడి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.. మూడు రోజులుగా వరుసగా పైకి కదులుతూ వచ్చిన బంగారం ధరలు.. ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి.. 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 47,050గా కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,330 దగ్గర కొనసాగుతోంది.. ఇక, వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు.. కిలో వెండి ధర రూ. 65,900గా ఉంది.. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు.. […] -
Konaseema: కోనసీమలో నేటి నుంచి సెక్షన్ 144 అమలు..
కోనసీమ జిల్లా ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు సెక్షన్ 144 అమలు చేస్తున్నట్టు ప్రకటించారు ఎస్పీ సుబ్బారెడ్డి… కోనసీమలోని అమలాపురం, పి గన్నవరం నియోజకవర్గాలతో పాటు కొత్తపేట, కాట్రేనికొన, రావులపాలెం మండలాల్లో సెక్షన్ 144 విధించినట్టు వెల్లడించారు.. సెక్షన్ 144 అమలులో ఉన్న కారణంగా ఎటువంటి ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.. కోనసీమ జిల్లా పేరు మార్పు ఆందోళనల నేపధ్యంలో శాంతిభద్రతల కోసం 450 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?