ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో రూపకల్పన చేసిన జగనన్న విద్యా దీవెన మరో విడత మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధం అయ్యారు.. రేపు సచివాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి విద్యార్థుల తల్లుల ఎకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు.
Read Also: AICC: కాంగ్రెస్ ప్రక్షాళన.. అధిష్టానం కీలక ఆదేశాలు
అక్టోబర్ – డిసెంబర్ 2021 త్రైమాసికానికి జగనన్న విద్యా దీవెన పథకం కింద విద్యార్థులకు ఆర్ధిక సహాయం చేయబోతోంది ప్రభుత్వం.. ఈ సారి దాదాపు 10.82 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధిచేకూరనుంది.. ఒకేసారి రూ. 709 కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోన్న విషయం తెలిసిందే.