Akash Deep Wedding: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇంట పెళ్లి బాజాలు.. పూర్తి షెడ్యూల్ విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akash Deep Wedding: భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఆకాశ్‌దీప్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బీహార్‌లోని రోహ్తాస్ జిల్లా బడ్డీ గ్రామానికి చెందిన ఈ యువ క్రికెటర్, జూన్ 24న అక్షిత రాజ్‌ను వివాహం చేసుకోనున్నాడు. ఈ పెళ్లి వార్తతో అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఆకాశ్‌దీప్‌కు కాబోయే వధువు అక్షిత రాజ్ దేహ్రీలోని మాణిక్‌పూర్‌కు చెందిన యువతి. వీరి వివాహ వేడుకలు పలు రోజుల పాటు సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. జూన్ 21న బడ్డీ గ్రామంలో తిలక్ కార్యక్రమంతో పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి.
తదుపరి రోజు జూన్ 22న మెహందీ వేడుక, జూన్ 23న హల్దీ కార్యక్రమం జరగనుంది. అనంతరం జూన్ 24న ఆకాశ్‌దీప్ పెళ్లి ఊరేగింపు వారణాసిలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు చేరుకోనుంది. అక్కడ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ప్రత్యేక ఆహ్వానితుల సమక్షంలో వివాహం ఘనంగా జరగనుంది. ఈ వివాహానికి బీహార్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి రాజకీయ, క్రీడా రంగ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో బడ్డీ గ్రామంలో ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు తమ ప్రాంతానికి చెందిన క్రికెట్ స్టార్ వివాహాన్ని ప్రత్యక్షంగా చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
ఇదిలా ఉండగా, బీహార్ ఉప ముఖ్యమంత్రి Samrat Choudhary మంగళవారం ఆకాశ్‌దీప్ స్వగ్రామాన్ని సందర్శించి, అతని కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఆకాశ్‌దీప్‌కు వివాహ శుభాకాంక్షలు తెలియజేసి, కొత్త జీవితంలో ఆనందం, విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు. ముఖ్య అతిథి రాకతో కుటుంబ సభ్యుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఆకాశ్‌దీప్ తల్లి శాలువా కప్పి సమ్రాట్ చౌదరిని సత్కరించగా, ఆకాశ్‌దీప్ స్వయంగా పూలగుత్తి అందించి స్వాగతం పలికాడు. కుటుంబ సభ్యులు కూడా ఆయనతో సమావేశమై కృతజ్ఞతలు తెలిపారు. తన అద్భుతమైన బౌలింగ్‌తో భారత జట్టులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆకాశ్‌దీప్ ఇప్పుడు జీవితంలో మరో కీలక మైలురాయిని చేరుకోబోతున్నాడు. అతని వివాహ వేడుకల కోసం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!