వినూత్న నిర్ణయాలతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దూసుకెళ్తున్నారు.. ఇప్పటికే ఆయన తీసుకున్న పలు నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది.. నెటిజన్లు ఆయనను ఆకాశానికి ఎత్తుతున్నారు.. మరో వైపు.. అసెంబ్లీలో తనను పొడిగేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేలకు కూడా ఆయన వార్నింగ్ ఇవ్వడం చర్చగా మారింది. ఇక, అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టారు సీఎం స్టాలిన్.. నిన్న ఆర్ధరాత్రి సమయంలో సేలం నుంచి ధర్మపురికి వెళ్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్… అధ్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు చేశారు.. దీంతో.. పోలీసులంతా […]
హుజురాబాద్‌లో ఉప ఎన్నికల హీట్ పెరిగిపోతోంది.. బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతుండగా.. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇక, గత ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ స్థానంపై ఫోకస్ పెట్టింది… ఇప్పటికే పలు దఫాలుగా హుజురాబాద్ ఉప ఎన్నికలపై చర్చించింది టి.పీసీసీ.. ఈ స్థానం నుంచి మాజీ మంత్రి కొండా సురేఖను బరిలోకి దింపాలని భావిస్తోంది.. […]
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన గల్లా అరుణకుమారి, ప్రస్తుత టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సహా 12 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. చిత్తూరు జిల్లాలో గల్లా అరుణకుమారి కుటుంబీకుల భూ ఆక్రమణల విషయంలో ఈ కేసులు నమోదు చేశారు.. గల్లా అరుణ కుమారి, ఆమె కుమారుడు ఎంపీ గల్లా జయదేవ్, గల్లా రామచంద్ర నాయుడుతో సహా 12 మంది మీద కేసు నమోదైనట్టు పోలీసులు చెబుతున్నారు. జిల్లాలోని తవణంపల్లి మండలం దిగువ మాగంలో గల్లా […]
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలోని మాజీ సైనికుల పెండింగ్ సమస్యలను ఆ లేఖ ద్వారా రాజ్‌నాథ్ దృష్టికి తీసుకెళ్లారు.. ఇక, సోము వీర్రాజు.. రాజ్‌నాథ్ సింగ్‌కు రాసిన లేఖలో పేర్కొన్న ముఖ్యమైన అంశాల విషయానికి వస్తే.. ఆర్మీ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్‌ను విజయవాడలో ఏర్పాటు చేయాలని కోరారు.. ఇతర రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా మాజీ సైనికుల వాహనాలకు […]
సినీ దర్శకనిర్మాత, రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి ఇంటిపై రాళ్ల దాడికి దిగారు గుర్తుతెలియని వ్యక్తులు.. హైదరాబాద్ అమీర్‌పేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడ నివాసం ఉంటున్నారు పోసాని.. అయితే, అర్ధరాత్రి ఆయన నివాసం దగ్గరకు వచ్చిన కొందరు దుండగులు.. పోసాని ఇంటిపై రాళ్లువిసిరారు.. పోసానిని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయిన రాళ్ల దాడికి పూనుకున్నారు.. ఊహించన ఘటనతో వాచ్‌మన్ కుటుంబ సభ్యులు భయాందోళనకు దురయ్యారు.. అయితే, ఘటనా జరిగిన సమయంలో పోసానిగానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ […]
వివాదాస్పద నిర్ణయాలు, ఎవరైతే నాకేంటి అంటూ ఇచ్చే ప్రకటనలు, వివాదాస్పద చేష్టలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు ఉత్తర కొరియా నియంత కిమ్… తాజాగా, కొత్త తరహా హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది ఉత్తర కొరియా. హాసంగ్-8గా ఆ మిస్సైల్‌ను పిలుస్తున్నారు. అయిదేళ్ల సైనిక అభివృద్ధి ప్రణాళికలో భాగంగా అయిదు కొత్త ఆయుధాలను తయారు చేశామని, దాంట్లో ఈ మిస్సైల్ కూడా ఒకటని నార్త్ కొరియా తెలిపింది. ఇదొక వ్యూహాత్మక ఆయుధమని ఆ దేశం చెబుతోంది. ఉత్తర కొరియా ఇచ్చిన […]
కరోనా మహమ్మారి పుట్టినిల్లుగా పిలుస్తున్న చైనాలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. దీంతో కేసులను నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకరిద్దరికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినా.. వేల మందికి పరీక్షలు చేస్తోంది. మరోవైపు ఉత్తర చైనాలోని హార్బిన్ పట్టణానికి చెందిన మూడు పిల్లులకు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో వాటిని అధికారులు చంపేశారు. కరోనా సోకిన జంతువులకు చికిత్స లేకపోవడం.. వాటి ద్వారా యజమానులు, అపార్ట్మెంట్ వాసులకు ప్రమాదం పొంచిఉన్న కారణంగా తప్పని […]
మహిళలు బయటకు వెళ్లాలంటేనే ఆలోచించేలా చేస్తున్నారు కామాంధులు.. దేశవ్యాప్తంగా ఏదోఒక చోట వరుసగా చిన్నారులు, యువతులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా అత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. తాజాగా నిజామాబాద్‌లో దళిత యువతిపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు నలుగురు యువకులు.. నిందితుల్లో ఓ యువకుడితో సదరు యువతికి ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడినట్టుగా తెలుస్తుండగా.. ఇక, బర్త్ డే పార్టీ ఉందంటూ.. యువతిని ఆహ్వానించాడు ఆ కామాంధుడు.. దీంతో.. ఆర్మూర్ నుంచి […]
భారత్‌లో రోజు వారి కరోనా కేసులు సంఖ్య భారీగా తగ్గి.. 20 వేలకు దిగువకు పడిపోయిన ఊరట కలిగిస్తున్న సమయంలో.. మరోసారి భారీగా పెరిగాయి కోవిడ్ కేసులు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. మరోసారి 20 వేల మార్క్‌ను క్రాస్ చేశాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23,529 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 311 మంది కరోనా బారినపడి ప్రాణాలు విడిచారు. ఇక, ఇదే సమయంలో 28,718 మంది […]
తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించిన గులాబ్ తుఫాన్ గురించి పూర్తిగా మర్చిపోకముందే మరో తుఫాను విజృంభించడానికి రెడీ అవుతోంది. ఉత్తర అరేబియా సముద్రంలో ఈ తుఫాను ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళే ఈ తుఫాను ఏర్పడుతుందని ఐఎండీ అభిప్రాపయపడుతోంది. దీనికి ‘సైక్లోన్ షహీన్ అని పేరు పెట్టారు. ఈ పేరును కతార్ సూచించింది. ఈ తుఫాను భారత్‌పై పెద్దగా ప్రభావం చూపించబోదని పరిశోధకులు చెప్తున్నారు. ఇది పాకిస్థాన్ వైపు వెళ్లనుందని వివరించారు. అయితే భారీ […]