సంచలన విషయాలు బయటపెట్టిన పాకిస్థాన్ టెర్రరిస్ట్ అలీ బాబర్.. ఉగ్రవాదులను భారత్‌పై ఎగదోసి దాడులు చేసే ప్రయత్నాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. పాక్ యువతకు ఉగ్రవాద శిక్షణ ఇస్తూ వారిని భారత్‌లోకి పంపుతోంది. జమ్మూకశ్మీర్‌లోని ఉరి సెక్టార్లో పట్టుబడిన అలీ బాబర్ పాత్ర అనే పాక్ ఉగ్రవాది ఈ సంచలన విషయాలు వెల్లడించాడు. అతడికి లష్కరే తోయిబాతోపాటు పాకిస్థాన్ ఆర్మీ శిక్షణ ఇచ్చారని… అంతేకాదు బారాముల్లాలోని ఓ ప్రాంతానికి ఆయుధాలను చేరవేసేందుకు ఇరవై వేలు ఇచ్చారన్నాడు. కాగా, […]
ఢిల్లీలో చీర కట్టుకున్నందుకు ఓ మహిళకు ఎంట్రీ నిరాకరించిన అక్విల్ రెస్టారెంట్‌కు నోటీసులు జారీ అయ్యాయి. రెస్టారెంట్‌ను మూసేయాలంటూ సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసు పంపింది. ఆండ్రూస్ గంజ్‌లోని అన్సల్ ప్లాజా వద్ద ఉన్న అక్విల్ రెస్టారెంట్ లైసెన్స్ లేకుండా నడుపుతున్నట్టు తెలిపారు అధికారులు. ఈనెల 21న పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్ అక్కడకు వెళ్లి హెల్త్ ట్రేడ్ లైసెన్స్ లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో రెస్టారెంట్ నడుపుతున్నట్టు గుర్తించారు. ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకున్నట్టు అధికారి దృష్టికి […]
పంజాబ్ కాంగ్రెస్‌లో సంక్షోభం మరింత ముదిరింది. మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఏకంగా అమిత్‌షాతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారగా.. ఆయన ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారంటూ ప్రచారం సాగుతోంది.. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి నవజోత్ సింగ్ సిద్ధూ అనూహ్య రాజీనామాతో సంక్షోభం ముదిరింది. అమరీందర్, సిద్ధూ మధ్య విభేదాలు పార్టీని నట్టేట ముంచేలా కనిపిస్తున్నాయి.. ఓవైపు సంక్షోభం కొనసాగుతున్న వేళ.. మరోవైపు మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కేంద్ర హోంమంత్రి […]
ఐపీఎల్లో బెంగళూరు జోరు కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. అయితే, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు… ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సన్నగిల్లాయి. బెంగళూరు చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడిన రాజస్థాన్… 8 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. ఆ టీమ్ ప్లే ఆఫ్ చేరాలంటే… టోర్నీలో మిగిలిన నాలుగు మ్యాచ్‌లను తప్పక గెలవాల్సిందే. కాగా, రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్… 20 ఓవర్లలో […]
భవానీపూర్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.. మూడోసారి బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మమతా బెనర్జీ.. కీలక ఎన్నిక ఎదుర్కోబోతున్నారు. నందిగ్రామ్‌లో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓడినప్పటికీ.. మమతా బెనర్జీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆరునెలల్లోగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. ఇందుకోసం భవానీపూర్ నియోజకవర్గంలో గెలిచిన వ్యవసాయ మంత్రి శోబన్‌దేవ్ ఛటోపాధ్యాయ రాజీనామా చేశారు. ఆ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికలో మమత పోటీ చేస్తున్నారు. 2011, 2016 ఎన్నికల్లో […]
ప్రతి నెల 1వ తేదీ వచ్చిందంటే చాలు.. ఎక్కడున్నా సరే స్వగ్రామానికి వెళ్లాలి, లేదంటా పెన్షన్ కట్ అవుతుంది అనే టెన్షన్ చాలా మంది వృద్ధులు, ఇతర పెన్షన్ దారుల్లో ఉంటుంది.. పెన్షన్ కోసం ఇతర ప్రాంతల నుంచి స్వగ్రామానికి వెళ్లివచ్చేవారు కూడా లేకపోలేదు.. ఇక, ఎలాంటి ఇబ్బంది లేకుండా.. వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పటి వరకు గ్రామ, వార్డు సచివాలయాల ఆధ్వర్యంలో వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ […]
మేషం: ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులు స్థానచలన యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. మీరు కోరుకుంటున్న అవకాశాలను పొందే సమయం ఆసన్నమవుతుంది. రిప్రజెంటేటివ్‌లకు పురోభివృద్ధి కానవస్తుంది. నిరుద్యోగులు నిర్లిప్తత ధోరణివల్ల సదవకాశాలు జారవిడుచుకునే ప్రమాదం ఉంది.. వృషభం: ఈ రోజు ఈ రాశిలోని ఉద్యోగస్తులకు అధికారులతో ఏకీభావం కుదరదు. ధనం విరివిగా వ్యయమైనా సార్థకత, ప్రయోజనం ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. రావలసిన ధనం […]
తెలుగు అకాడమీలో అక్రమాలు వెలుగుచూశాయి.. తెలుగు అకాడమీకి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. వాటిని నిగ్గు తేల్చే పనిలో పడిపోయారు అధికారులు.. దాని కోసం ముగ్గురు సభ్యులతో కూడిన శాఖాపరమైన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉమర్ జలీల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, కాలేజీ ఎడ్యుకేషన్ జాయింట్ డైరెక్టర్ యాదగిరి.. ఆ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. అక్టోబర్ 2వ తేదీలోగా ఈ కమిటీ […]
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై దర్శకనిర్మాత, రచయిత, సినీ నటుడు పోసాని మురళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.. పోసాని వ్యాఖ్యలను జీర్ణించుకోలేని కొందరు పవన్ అభిమానులు.. పోసానిపై దాడికి కూడా యత్నించారు.. పీఎస్‌లో కూడా ఫిర్యాదు చేశారు. ఇక, తాజాగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో పోసాని కృష్ణ మురళిపై ఫిర్యాదు చేశారు జనసేన నాయకులు.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో దూషించారని సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై […]
కరోనా ఫస్ట్ వేవ్‌తో పాటు సెకండ్ వేవ్ భారత్‌లో కల్లోలమే సృష్టించింది.. అయితే, భారత్‌లో ఎక్కువగా ఇబ్బంది పడింది.. ఎక్కువ కేసులు వెలుగు చూసింది మాత్రం మహారాష్ట్రలోనే.. ఇక, ఆ రాష్ట్ర రాజధాని ముంబైలోనే పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు అవుతూ వచ్చాయి.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. దీంతో.. మహారాష్ట్రతో పాటు ముంబైలో అక్టోబర్ 4 నుంచి స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించింది ప్రభుత్వం.. మొదట.. 8-12 తరగతుల విద్యార్థులకు భౌతిక క్లాసులు ప్రారంభిస్తామని బృహన్ […]